ఒడిషాకు ఏపీ రూ.15 కోట్ల సాయం

ఒడిషాలోని ‘ఫొని’ తుపాన్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు రూ.15 కోట్ల విరాళం ప్రకటించారు. ఫొని తుపానుతో ఒడిషా అస్తవ్యస్తంగా తయారైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒడిషా బాధితులకు అండగా ఉండాలని ఏపి సిఎం పిలుపునిచ్చారు. అందరూ ముందుకు వచ్చి ఆపన్నహస్తం అందించాలని కోరారు. ‘విపత్తుల వల్ల కలిగే నష్టం తీవ్రత అపారం. ఆంధ్రప్రదేశ్ లో తరచూ విపత్తుల వల్ల నష్టం తెలిసిందే. తుపాన్ బాధితులను ఆదుకోవడం మానవాతా ధర్మం. బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలి. ఒడిషా […]

ఒడిషాకు ఏపీ రూ.15 కోట్ల సాయం
Follow us
Ram Naramaneni

|

Updated on: May 05, 2019 | 8:58 PM

ఒడిషాలోని ‘ఫొని’ తుపాన్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు రూ.15 కోట్ల విరాళం ప్రకటించారు. ఫొని తుపానుతో ఒడిషా అస్తవ్యస్తంగా తయారైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒడిషా బాధితులకు అండగా ఉండాలని ఏపి సిఎం పిలుపునిచ్చారు. అందరూ ముందుకు వచ్చి ఆపన్నహస్తం అందించాలని కోరారు. ‘విపత్తుల వల్ల కలిగే నష్టం తీవ్రత అపారం. ఆంధ్రప్రదేశ్ లో తరచూ విపత్తుల వల్ల నష్టం తెలిసిందే. తుపాన్ బాధితులను ఆదుకోవడం మానవాతా ధర్మం. బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలి. ఒడిషా ప్రభుత్వానికి కావాల్సిన సాయం అందిస్తాం. జాతీయ రహదారిపై చెట్ల తొలగింపు యుద్ధప్రాతిపదికన చేయాలి. ఇప్పటికీ ఒడిషాలో చాలా గ్రామాల్లో కరెంటు లేదు. తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తినష్టం, పంటనష్టం అపారంగా జరిగింది. తాగునీరు, ఆహారం, పాలు, కూరగాయలు సరఫరా చేయాలి. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాధితులను ఆదుకోవాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల ఒడిశాలో 29 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆదివారం అధికారికంగా వెల్లడించారు. దీంతో పాటు రాష్ట్రంలో వందల కోట్ల రూపాయల  నష్టం వాటిల్లింది. విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచార వ్యవస్థ దెబ్బతింది. కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో తుపాను బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని సీఎం నవీన్‌ పట్నాయక్‌ హామీ ఇచ్చారు. ఆదివారం భువనేశ్వర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించే సహాయాన్ని వెల్లడించారు.