రేపు పోలవరం వెళ్తా….. అసలు వెళ్తే తప్పేంటి..? : చంద్రబాబు
తాను రేపు పోలవరంలో పర్యటించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తాను పోలవరం వెళితే తప్పేమిటని ఈసీని ఉద్దేశించి ప్రశ్నించారు. అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు సమీక్షకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని అన్నారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని పేర్కొన్నారు. ఎన్నికలలో తెలుగుదేశం విజయం తథ్యమని… సైలంట్ ఓటింగ్ తెలుగుదేశం పార్టీకే అనుకూలమని చంద్రబాబు అన్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు సీఎం సమీక్షలపై తీవ్ర దుమారం రేగిన […]
తాను రేపు పోలవరంలో పర్యటించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తాను పోలవరం వెళితే తప్పేమిటని ఈసీని ఉద్దేశించి ప్రశ్నించారు. అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు సమీక్షకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని అన్నారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని పేర్కొన్నారు. ఎన్నికలలో తెలుగుదేశం విజయం తథ్యమని… సైలంట్ ఓటింగ్ తెలుగుదేశం పార్టీకే అనుకూలమని చంద్రబాబు అన్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు సీఎం సమీక్షలపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో.. ఇప్పుడు పోలవరం వెళతానని చంద్రబాబు అనడంపై.. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందన్న విషయం ఆసక్తి కలిగిస్తోంది.