బాబు ఇల్లే నెక్ట్స్ టార్గెట్..లింగమనేనికి త్వరలో నోటీసులు
అక్రమ కట్టడాల విషయంలో ఏపీ సర్కార్ దూకుడుగా వ్యవహరిసోంది. ఇప్పటికే ప్రజావేదికను కూల్చివేసిన అధికారులు..ఆ పక్కనే ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దృష్టి పెట్టారు. బాబు ఉంటోన్న గెస్ట్ హౌస్ ఓనర్ లింగమనేని రమేష్‌కు సీఆర్‌డీఏ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక పక్కన చంద్రబాబునాయుడు లింగమనేని గెస్ట్ హౌస్‌ను అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటిని అక్రమ కట్టడంగా భావిస్తోన్న అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. నిబంధనలను అతిక్రమించి ఆ ఇంటిని ఎంతమేర నదీ గర్భంలో కట్టారో […]
అక్రమ కట్టడాల విషయంలో ఏపీ సర్కార్ దూకుడుగా వ్యవహరిసోంది. ఇప్పటికే ప్రజావేదికను కూల్చివేసిన అధికారులు..ఆ పక్కనే ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దృష్టి పెట్టారు. బాబు ఉంటోన్న గెస్ట్ హౌస్ ఓనర్ లింగమనేని రమేష్‌కు సీఆర్‌డీఏ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక పక్కన చంద్రబాబునాయుడు లింగమనేని గెస్ట్ హౌస్‌ను అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటిని అక్రమ కట్టడంగా భావిస్తోన్న అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. నిబంధనలను అతిక్రమించి ఆ ఇంటిని ఎంతమేర నదీ గర్భంలో కట్టారో తెలుసుకోవడానికి రెవిన్యూ అధికారులు ఆదివారం నాడు ఉండవల్లి నివాసానికి వెళ్లనున్నారు. ఎంత భాగం ఆక్రమణలో ఉంది? ఎన్ని గదులు అక్రమంగా నిర్మించారో లెక్కలు తీయనున్నారు. ప్రజావేదికను కూల్చిన సమయంలోనే తన ఇంటి వరకు వ్యవహారం వస్తుందని భావించిన చంద్రబాబునాయుడు ఇప్పటికే వేరే ఇంటిని అద్దెకు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. విజయవాడ తాడిగడపలోని గ్రావెల్ ఇండియా కంపెనీకి చెందిన గెస్ట్ హౌస్‌ను చంద్రబాబు అద్దెకు తీసుకోనున్నట్టు సమాచారం.