నిపుణుల కమిటీతో నేడు సీఎం జగన్ భేటీ
అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. దీని కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నేడు ఈ కమిటీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, సీఆర్‌డీఏ, రహదారులు, పురపాలక, పట్టణాభివృద్ధి, భవనాల శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు చేపట్టిన ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలపై విచారణ కోసం సీఎం ఆదేశాల మేరకు 8 […]
అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. దీని కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నేడు ఈ కమిటీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులు, సీఆర్‌డీఏ, రహదారులు, పురపాలక, పట్టణాభివృద్ధి, భవనాల శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు చేపట్టిన ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలపై విచారణ కోసం సీఎం ఆదేశాల మేరకు 8 మంది సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ జూన్ 14న జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ జరిపి, 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీకి ఆయన సూచించారు. కాగా నిర్దేశిత గడువులోగా విచారణను పూర్తి చేసేందుకు నిపుణుల కమిటీ మూడు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది.