ఫుడ్ ప్రాసెసింగ్ పై సీఎం జగన్ కీలక సూచనలు
ఫుడ్ ప్రాసెసింగ్‌లో పెద్ద కంపెనీలతో అనుసంధానం చాలా ముఖ్యమన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లేని పక్షంలో మార్కెటింగ్ సమస్యలు ఏర్పడతాయని వివరించారు. ఇలాంటి అంశాల్లో మహిళా గ్రూపులను ప్రోత్సహించేటప్పుడు వారి ఉత్పత్తులకు...

ఫుడ్ ప్రాసెసింగ్‌లో పెద్ద కంపెనీలతో అనుసంధానం చాలా ముఖ్యమన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లేని పక్షంలో మార్కెటింగ్ సమస్యలు ఏర్పడతాయని వివరించారు. ఇలాంటి అంశాల్లో మహిళా గ్రూపులను ప్రోత్సహించేటప్పుడు వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ చాలా ముఖ్యమని సీఎం అన్నారు. దీని కోసం కంపెనీలతో అనుసంధానం చేసిన తర్వాతనే ముందడుగు వేయాలని మార్గ నిర్దేశం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం త్వరలో ఏర్పాటు చేయనున్న కాలేజీల్లో ప్రత్యేక కోర్సులు నిర్వహించాలని సూచించారు. జిల్లాల్లో నెలకొల్పుతున్న ఇంటిగ్రేటెడ్ ల్యాబుల్లో అంతర్భాగంగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు చేయాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రైతులు తరచుగా ఇబ్బందులు పడుతున్న ఏడెనిమిది ప్రధాన పంటలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలని, ఆ ప్రాసెసింగ్ సెంటర్లలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. వ్యవసాయ శాఖ శాఖ మంత్రి కె.కన్నబాబు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎమ్వీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యతో పాటు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.




