షాతో జగన్ కీలక భేటీ.. ఏం చర్చించబోతున్నారంటే..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ ఉదయం పోలీసు అమర వీరుల సంస్మరణ సభలో పాల్గొన్న అనంతరం.. ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. ఆ సందర్భంగా విభజన సమస్యల పరిష్కారం, పోలవరం నిధులు తదితర అంశాలను ఆయన చర్చిస్తారని సమాచారం. ఇక సోమవారం రాత్రి జగన్ అక్కడే బస చేయనున్నారు. అయితే […]

షాతో జగన్ కీలక భేటీ.. ఏం చర్చించబోతున్నారంటే..!
Follow us

| Edited By:

Updated on: Oct 21, 2019 | 8:06 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ ఉదయం పోలీసు అమర వీరుల సంస్మరణ సభలో పాల్గొన్న అనంతరం.. ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. ఆ సందర్భంగా విభజన సమస్యల పరిష్కారం, పోలవరం నిధులు తదితర అంశాలను ఆయన చర్చిస్తారని సమాచారం. ఇక సోమవారం రాత్రి జగన్ అక్కడే బస చేయనున్నారు.

అయితే అమిత్ షాతో జగన్ భేటీ ఇప్పటికే రెండుసార్లు రద్దు అయ్యింది. అక్టోబర్ 12న అమిత్ షాతో అపాయింట్‌మెంట్ ఖరారైంది. కానీ కొన్ని కారణాల వలన ఆ భేటీ రద్దయినట్లు హోంమంత్రి కార్యాలయం తెలిపింది. ఆ తరువాత అక్టోబర్ 14న ఆయన ఢిల్లీ వెళ్తారని వార్తలొచ్చాయి. కానీ మహారాష్ట్ర, హర్యాని ఎన్నికల్లో అమిత్ షా బిజీగా ఉండటంతో.. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత జగన్ ఢిల్లీ వెళ్తున్నారు.

ఇక షాతో జగన్ ఏపీలోని ప్రస్తుత పరిస్థితులతో పాటుగా.. రాజకీయ అంశాల పైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కేంద్రం నుండి పీపీఏల సమీక్ష పైన వస్తున్న అభ్యంతరాలు.. ఏపీలో ప్రస్తుతం డిస్కింల ఆర్దిక పరిస్థితి గురించి సీఎం.. షాకు వివరించనున్నట్లు సమాచారం. అదే విధంగా కేంద్రం నుండి పెండింగ్ లో ఉన్న పోలవరం రీయంబర్స్ మెంట్ నిధులను సైతం విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కోరనున్నారు. ఏపీకి రెవిన్యూ లోటు నిధులు.. రాజధానికి ఆర్దిక సాయం.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు.. వెనుకబడిన జిల్లాల డెవలప్ మెంట్ ఫండ్ కేటాయింపు వంటి వాటి గురించి విభజన చట్టం నోడల్ శాఖగా ఉన్న హోం శాఖ చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి నివేదిక ఇవ్వనున్నారు.