ఐటీ దాడులపై చంద్రబాబు ఫైర్

గుంటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదనందిపాడు రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు… జగన్, కేసీఆర్, మోదీలపై విరుచుకుపడ్డారు. జగన్‌పై కేసులున్నాయని.. మోదీ, కేసీఆర్ ఏమి చెబితే.. అది జగన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కోర్టులు కొట్టేసిన కేసులను తిరగదోడుతున్నారని, కావాలనే తమ పార్టీ నేతలపై ఐటీ దాడులు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రధానిగా మోదీ ఉంటే మనకు న్యాయం జరగదని.. ఎవరు సహకరించకపోయినా పోలవరం ఆగదని చంద్రబాబు మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి, పెన్నా, నాగావాళి […]

ఐటీ దాడులపై చంద్రబాబు ఫైర్
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 04, 2019 | 9:51 PM

గుంటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదనందిపాడు రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు… జగన్, కేసీఆర్, మోదీలపై విరుచుకుపడ్డారు. జగన్‌పై కేసులున్నాయని.. మోదీ, కేసీఆర్ ఏమి చెబితే.. అది జగన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కోర్టులు కొట్టేసిన కేసులను తిరగదోడుతున్నారని, కావాలనే తమ పార్టీ నేతలపై ఐటీ దాడులు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రధానిగా మోదీ ఉంటే మనకు న్యాయం జరగదని.. ఎవరు సహకరించకపోయినా పోలవరం ఆగదని చంద్రబాబు మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కృష్ణా, గోదావరి, పెన్నా, నాగావాళి నదులను అనుసంధానం చేస్తానని బాబు హామీ ఇచ్చారు. 140 నదులను అనుసంధానం చేస్తామని ప్రకటించారు. ఏపీ బాగుపడితే తనకు పేరు వస్తుందని.. మోదీ బాధపడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఏపీలో కూడా హైదరాబాద్ లాంటి నగరాలను నిర్మిస్తానని.. హైదరాబాద్ లో కూడా తాను చేసిన అభివృద్ధి తప్ప.. ఇంకేమి లేదని ఆయన పేర్కొన్నారు.