కేసీఆర్ బాటలో జగన్.. ఏపీలో కూడా సీన్ రిపీట్ కానుందా..? కీలక నిర్ణయాలు అందుకేనా..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూట్‌ ఫాలో అవుతున్నారా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఏపీ కేబినెట్‌ తీసుకున్న పలు నిర్ణయాలు చూస్తే.. సేమ్ కేసీఆర్ ఫార్ములాను.. జగన్ కూడా ఫాలో అవుతున్నట్లు అర్ధమవుతోంది. వచ్చే మార్చి నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు చూస్తే.. సేమ్ తెలంగాణలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్లాగే ఉన్నాయి. బుధవారం ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ […]

కేసీఆర్ బాటలో జగన్.. ఏపీలో కూడా సీన్ రిపీట్ కానుందా..? కీలక నిర్ణయాలు అందుకేనా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 13, 2020 | 6:00 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూట్‌ ఫాలో అవుతున్నారా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఏపీ కేబినెట్‌ తీసుకున్న పలు నిర్ణయాలు చూస్తే.. సేమ్ కేసీఆర్ ఫార్ములాను.. జగన్ కూడా ఫాలో అవుతున్నట్లు అర్ధమవుతోంది. వచ్చే మార్చి నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు చూస్తే.. సేమ్ తెలంగాణలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్లాగే ఉన్నాయి.

బుధవారం ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని.. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలుపై కేబినెట్లో చర్చించినట్లు పేర్కొన్నారు. వచ్చే మార్చి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా చూస్తామన్నారు. నోటిఫికేషన్ వచ్చిన 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేవిధంగా చట్టంలో మార్పులు తీసుకువస్తామన్నారు.

అయితే ఈ సారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో.. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అవసరమైతే వారిపై అనర్హత వేటు కూడా వేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే చర్యలు తీసుకుంటామన్నారు.

సర్పంచ్‌లకు కీలక బాధ్యతలు..

ఇక నుంచి సర్పంచ్‌లకు కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్లు కూడా మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యతలను సర్పంచ్‌లదే అని తేల్చిచెప్పేశారు. ఇక కేబినెట్‌ మీటింగ్‌లో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని.. ఉచిత విద్యుత్‌ కోసం రైతు రూ.8వేల కోట్ల సబ్సిడీ కేటాయించామని వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి 8 రోజులు, పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి ఐదు రోజులు గడువును విధించినట్లు తెలిపారు. ఇక గ్రామంలో సర్పంచ్‌లుగా ఎన్నికైన వారు.. స్థానికంగ ప్రజలకు అందుబాటులో ఉండేలా నిబంధనలను తీసుకొస్తామని.. గిరిజన ప్రాంతాలలో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌, పదవులను ఎస్టీలకే కేటాయిస్తామన్నారు.

అయితే జగన్ కేబినెట్ తీసుకున్న పై నిర్ణయాలన్నీ.. దాదాపు తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన వాటికి సారూప్యంగానే ఉన్నాయి. కేసీఆర్ తీసుకొచ్చిన ఈ కీలక నిర్ణయాల తర్వాత.. స్థానిక ఎన్నికలతో పాటుగా.. తాజాగా జరిగిన పుర పాలక ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దీంతో జగన్ కూడా కేసీఆర్ రూట్‌నే ఎంచుకున్నారని తెలుస్తోంది.