పవన్‌కు షాక్.. జనసేనకు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత…
Shock To Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆయన ఒకవైపు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తుండగా.. సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటిస్తుండటం వల్లే తాను పార్టీ నుంచి బయటికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇక తాజాగా అదే కోవలో మరో సీనియర్ నేత […]
Shock To Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆయన ఒకవైపు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తుండగా.. సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటిస్తుండటం వల్లే తాను పార్టీ నుంచి బయటికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇక తాజాగా అదే కోవలో మరో సీనియర్ నేత జనసేనకు రాజీనామా చేశారు.
గాజువాక నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరణం కనకారావు పార్టీని వీడారు. బుధవారం ఆయనతో పాటుగా 200 మంది జనసేన కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు. కాగా, పవన్ కళ్యాణ్ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజవర్గాల నుంచి పోటీ చేసి పరాజయంపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్నారు.