కివీస్‌తో టెస్టు సిరీస్.. జట్టులోకి రానున్న స్టార్ బ్యాట్స్‌మెన్…
India Vs New Zealand: కివీస్‌తో వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన టీమిండియాకు కాస్త ఊరట లభించినట్లే. త్వరలోనే జట్టుకు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులోకి రానున్నాడు. వచ్చే నెల 12వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌కు అతడి రీ-ఎంట్రీ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల లండన్‌లో చెకప్ చేయించుకున్న పాండ్యా.. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. రీ-ఎంట్రీ కోసం కఠోరంగా శ్రమిస్తున్న అతడు.. త్వరలోనే టీమ్ సెలక్షన్‌కు అందుబాటులోకి వస్తాడని.. […]
India Vs New Zealand: కివీస్‌తో వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన టీమిండియాకు కాస్త ఊరట లభించినట్లే. త్వరలోనే జట్టుకు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులోకి రానున్నాడు. వచ్చే నెల 12వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌కు అతడి రీ-ఎంట్రీ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల లండన్‌లో చెకప్ చేయించుకున్న పాండ్యా.. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. రీ-ఎంట్రీ కోసం కఠోరంగా శ్రమిస్తున్న అతడు.. త్వరలోనే టీమ్ సెలక్షన్‌కు అందుబాటులోకి వస్తాడని.. అంతేకాకుండా మార్చిలో జరిగే సఫారీ సిరీస్‌కు అతడు బరిలోకి దిగుతాడని ఎన్‌సీఏ అధికారి స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా హార్దిక్ పాండ్యా రాక కోసం టీమ్ మేనేజ్‌మెంట్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. న్యూజిలాండ్ పర్యటనకు ముందు అతడి కోసమే టెస్టు, వన్డే జట్ల ఎంపికను వాయిదా వేసింది. అయితే అతడు ఫిట్‌నెస్ టెస్టులో విఫలం కావడంతో చేసేదేమి లేక జట్లను ప్రకటించింది. ఇక రెగ్యులర్ ఆల్‌రౌండర్ టీమిండియాకు అందుబాటులో లేకపోవడం కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు తేటతెల్లమైంది. కాగా, వన్డేల్లో చేసిన తప్పిదాలు టెస్టుల్లో పునరావృత్తం కాకుండా చూసుకుంటామని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేసిన సంగతి విదితమే.