Breaking: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి..
Major Accident In Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫిరోజాబాద్‌లోని నాగ్లాఖాంగార్‌లో బుధవారం రాత్రి ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 31 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆగ్రా-లక్నో హైవేపై సుమారు రాత్రి 10 […]
Major Accident In Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫిరోజాబాద్‌లోని నాగ్లాఖాంగార్‌లో బుధవారం రాత్రి ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 31 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆగ్రా-లక్నో హైవేపై సుమారు రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.