శ్రీవారి కల్యాణ లడ్డూ ప్రియులకు గుడ్‌న్యూస్..! ఇకపై సామాన్యులకు కూడా..

తిరుమల శ్రీవారి లడ్డూ అంటే.. భక్తులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తిరుమల వెళ్తే చాలు.. స్వామి వారిని దర్శించుకున్నాక.. లడ్డూల కోసం ఎంత వెయిట్ చేస్తారో.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే స్వామి వారి లడ్డూకు ఉన్న ప్రత్యేకత అది. ఇక శ్రీవారి కల్యాణ లడ్డూ గురించి చెప్పక్కర్లేదు. ఈ లడ్డూ అందరికీ లభ్యమయ్యేది కాదు. కేవలం స్వామి వారికి కల్యాణం చేయించిన భక్తులకు మాత్రమే లభిస్తుంది. అయితే ఈ కల్యాణ టిక్కెట్లు దొరకడమన్నది అంత ఈజీ […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:17 am, Thu, 13 February 20
శ్రీవారి కల్యాణ లడ్డూ ప్రియులకు గుడ్‌న్యూస్..! ఇకపై సామాన్యులకు కూడా..

తిరుమల శ్రీవారి లడ్డూ అంటే.. భక్తులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తిరుమల వెళ్తే చాలు.. స్వామి వారిని దర్శించుకున్నాక.. లడ్డూల కోసం ఎంత వెయిట్ చేస్తారో.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే స్వామి వారి లడ్డూకు ఉన్న ప్రత్యేకత అది. ఇక శ్రీవారి కల్యాణ లడ్డూ గురించి చెప్పక్కర్లేదు. ఈ లడ్డూ అందరికీ లభ్యమయ్యేది కాదు. కేవలం స్వామి వారికి కల్యాణం చేయించిన భక్తులకు మాత్రమే లభిస్తుంది. అయితే ఈ కల్యాణ టిక్కెట్లు దొరకడమన్నది అంత ఈజీ కాదు. దీంతో ఈ కల్యాణ లడ్డూ సామాన్య భక్తులకు అసలు దొరకని పరిస్థితి. అయితే ఇక ఈ కల్యాణ లడ్డూను కూడా సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు టీటీడీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎలాంటి సిఫార్సు లెటర్స్‌ లేకుండా స్పెషల్ కౌంటర్ల ద్వారా విక్రయిస్తోంది. లడ్డూ ప్రధాన విక్రయ కేంద్రంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసి.. ఈ కల్యాణ లడ్డూల విక్రయాలను ప్రారంభించింది. దీని ధరను రూ.200గా నిర్ణయించారు. సామాన్య భక్తులకు కూడా ఈ కల్యాణ లడ్డూలను అందిస్తుండటంతో.. భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.