ఎంపీ విజయసాయి రెడ్డి పనితీరుకు రాజ్యసభ ప్రశంసలు

వైసీపీ ఎంపీ, ట్రబుల్ షూటర్.. విజయసాయి రెడ్డి ఉత్తమ పనితీరుకు రాజ్యసభ ప్రశంసలు దక్కాయి.  బడ్జెట్ సెషన్‌లో సాయి రెడ్డి చక్కగా ప్రసంగించారని  కితాబులు అందాయి.  155 మంది ఎంపీలు బడ్జెట్ సెషన్‌లో మాట్లాడగా, విజయసాయిరెడ్డి బెస్ట్ పార్టిసిపెంట్ అని రాజ్యసభ సచివాలయం పేర్కొంది. బడ్జెట్ సెషన్ లో 9 అవకాశాలను సాయి రెడ్డి సమర్థంగా వినియోగించుకున్నారన్న రాజ్యసభ సచివాలయం.. జీరో అవర్, ప్రత్యేక ప్రస్తావన, 5 సప్లమెంటరీలు, ఒక స్టార్ క్వశ్చన్, 4 స్టార్ ప్రశ్నలకు […]

ఎంపీ విజయసాయి రెడ్డి పనితీరుకు రాజ్యసభ ప్రశంసలు

వైసీపీ ఎంపీ, ట్రబుల్ షూటర్.. విజయసాయి రెడ్డి ఉత్తమ పనితీరుకు రాజ్యసభ ప్రశంసలు దక్కాయి.  బడ్జెట్ సెషన్‌లో సాయి రెడ్డి చక్కగా ప్రసంగించారని  కితాబులు అందాయి.  155 మంది ఎంపీలు బడ్జెట్ సెషన్‌లో మాట్లాడగా, విజయసాయిరెడ్డి బెస్ట్ పార్టిసిపెంట్ అని రాజ్యసభ సచివాలయం పేర్కొంది. బడ్జెట్ సెషన్ లో 9 అవకాశాలను సాయి రెడ్డి సమర్థంగా వినియోగించుకున్నారన్న రాజ్యసభ సచివాలయం.. జీరో అవర్, ప్రత్యేక ప్రస్తావన, 5 సప్లమెంటరీలు, ఒక స్టార్ క్వశ్చన్, 4 స్టార్ ప్రశ్నలకు సప్లమెంటరీ ప్రశ్నలు అడిగారని తెలిపింది.  వీటన్నింటితో పాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో చక్కగా పాల్గొన్నారని సాయి రెడ్డికి ప్రశంసలు అందాయి.