నేనెవరో తెలుసా..? నన్నే టోల్ ఫీజు అడుగుతారా..?మంత్రి భార్య హల్‌చల్
నల్లగొండ జిల్లా మాడుగులపల్లి టోల్‌గేట్ దగ్గర ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య హల్‌చల్ చేశారు. నేనెవరో తెలుసా.. నా కారుకే టోల్ ఫీజు అడుగుతారా..? అంటూ టోల్‌ప్లాజా సిబ్బందితో గొడవపడ్డారు. అయితే స్టిక్కర్ కాలపరిమితి దాటింది కాబట్టి టోల్‌ఫీజు కట్టాల్సిందేనని సిబ్బంది ఆమెకు స్పష్టం చేశారు. టోల్‌ఫీజు కట్టేదిలేదంటూ ఆమె వారితో వాగ్వాదానికి దిగారు. రూల్ ప్రకారం టోల్‌ఫీజు కట్టే వరకు కారు ముందుకు వెళ్లదని టోల్ సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో ఇక చేసేదేమీ […]
నల్లగొండ జిల్లా మాడుగులపల్లి టోల్‌గేట్ దగ్గర ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య హల్‌చల్ చేశారు. నేనెవరో తెలుసా.. నా కారుకే టోల్ ఫీజు అడుగుతారా..? అంటూ టోల్‌ప్లాజా సిబ్బందితో గొడవపడ్డారు. అయితే స్టిక్కర్ కాలపరిమితి దాటింది కాబట్టి టోల్‌ఫీజు కట్టాల్సిందేనని సిబ్బంది ఆమెకు స్పష్టం చేశారు. టోల్‌ఫీజు కట్టేదిలేదంటూ ఆమె వారితో వాగ్వాదానికి దిగారు.
రూల్ ప్రకారం టోల్‌ఫీజు కట్టే వరకు కారు ముందుకు వెళ్లదని టోల్ సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో ఇక చేసేదేమీ లేక టోల్‌ఫీజు చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు ప్రత్తిపాటి భార్య. ఎన్నోసార్లు ఈ రూట్‌లోనే వెళ్తాం.. కానీ ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు ఆమె.