విజయవాడలో గజ దొంగల ముఠా అరెస్టు

విజయవాడ: గత కొన్నేళ్లుగా అనేక నేరాలకు పాల్పడిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.54.60 లక్షల విలువైన 1258 గ్రాముల బంగారు ఆభరణాలను, 17.2 కిలోల వెండితో పాటు రూ. 9.65 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్టు విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.  మొత్తం ఆరుగురు సభ్యుల ముఠాలో ఇద్దరు ఇప్పటికే జైలులో ఉన్నారని తెలిపారు. ఈ ముఠాలో నాగరాజు […]

విజయవాడలో గజ దొంగల ముఠా అరెస్టు
Follow us

|

Updated on: May 17, 2019 | 7:42 PM

విజయవాడ: గత కొన్నేళ్లుగా అనేక నేరాలకు పాల్పడిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.54.60 లక్షల విలువైన 1258 గ్రాముల బంగారు ఆభరణాలను, 17.2 కిలోల వెండితో పాటు రూ. 9.65 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్టు విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.  మొత్తం ఆరుగురు సభ్యుల ముఠాలో ఇద్దరు ఇప్పటికే జైలులో ఉన్నారని తెలిపారు. ఈ ముఠాలో నాగరాజు నాయక్‌ అనే వ్యక్తిపై ఇప్పటివరకు 140 కేసులు ఉన్నాయని సీపీ చెప్పారు.  గుంటూరు జిల్లాకు చెందిన పుల్లేటికుర్తి బుజ్జి అనే మరో కరుడుగట్టిన దొంగతో పరిచయం ఏర్పచుకొని 2007 నుంచి నాగరాజు తెలుగు రాష్ట్రాల్లో దొంతనాలు చేశాడని వివరించారు. పుల్లేటికుర్తి ఉమామహేశ్వరావు (బుజ్జి)పై ఇప్పటివరకు 300కు పైగా కేసులు ఉన్నాయన్నారు.