23 తర్వాత వింతలు, విడ్డూరాలు చూడబోతున్నాం: విజయసాయి రెడ్డి

ఈ నెల 23 తర్వాత రాష్ట్రంలో చాలా వింతలు, విడ్డూరాలు చూడబోతున్నాం అంటూ తనదైన శైలిలో టీడీపీపై విరుచుకుపడ్డారు వైసీపీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. 23 తరువాత తెలుగుదేశం పార్టీ ముక్కచెక్కలవుతుందని, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించిన చంద్రబాబుపై తిరుగుబాటు జరుగుతుందని జోస్యం చెప్పారు. ఇది గమనించే పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు మహానాడును రద్దు చేశారని ఆయన దుయ్యబట్టారు. ఇంకా చాలా వింతలు, విడ్డూరాలు చూడబోతున్నామంటూ పేర్కొన్నారు. […]

23 తర్వాత వింతలు, విడ్డూరాలు చూడబోతున్నాం: విజయసాయి రెడ్డి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 17, 2019 | 4:06 PM

ఈ నెల 23 తర్వాత రాష్ట్రంలో చాలా వింతలు, విడ్డూరాలు చూడబోతున్నాం అంటూ తనదైన శైలిలో టీడీపీపై విరుచుకుపడ్డారు వైసీపీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. 23 తరువాత తెలుగుదేశం పార్టీ ముక్కచెక్కలవుతుందని, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించిన చంద్రబాబుపై తిరుగుబాటు జరుగుతుందని జోస్యం చెప్పారు. ఇది గమనించే పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు మహానాడును రద్దు చేశారని ఆయన దుయ్యబట్టారు. ఇంకా చాలా వింతలు, విడ్డూరాలు చూడబోతున్నామంటూ పేర్కొన్నారు.

అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌పై కూడా విజయసాయి రెడ్డి స్పందించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూతుల్లో దళితులను బెదిరించి టీడీపీ రిగ్గింగుకు పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో ఈసీ రీపోలింగ్‌కు ఆదేశించిందని ఆయన చెప్పారు. అక్రమాలకు పాల్పడకపోతే వాళ్లకెందుకు భయమంటూ విజయ సాయి ప్రశ్నించారు. సిగ్గులేకుండా రీపోలింగ్ అన్యాయం అంటూ చంద్రబాబు ఆందోళనకు దిగుతున్నారని.. దళితులు ఈసారైనా సత్తా చూపాలనిపేర్కొన్నారు.