లోకేశ్ గెలుపు కోసం దాదాపు రూ.200కోట్లు ఖర్చు చేశారు: ఆర్కే
మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ గెలుపు కోసం టీడీపీ చాలా ఖర్చు చేసిందని.. దాదాపు రూ.150కోట్ల నుంచి రూ.200కోట్ల వరకు ఖర్చు చేశారని వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని, ప్రజలే చెప్పుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలకు ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, టూవీలర్లు, టీవీలు, ఐఫోన్‌లు ఇష్టం వచ్చినట్లు పంచారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. టీడీపీ ఎన్ని […]
మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ గెలుపు కోసం టీడీపీ చాలా ఖర్చు చేసిందని.. దాదాపు రూ.150కోట్ల నుంచి రూ.200కోట్ల వరకు ఖర్చు చేశారని వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని, ప్రజలే చెప్పుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలకు ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, టూవీలర్లు, టీవీలు, ఐఫోన్‌లు ఇష్టం వచ్చినట్లు పంచారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా.. జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాలనుకున్న నిరుపేదలు, యువత, సామాన్యుల ఆకాంక్షల ముందు నిలబడవని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం, ఇతర కారణాలతోనే ఈ విషయాన్ని ఇంతవరకు తాను చెప్పలేదని.. ఇందుకు క్షమాపణలు కోరుతున్నానని చెప్పుకొచ్చారు. మంగళగిరి అసెంబ్లీ స్థానంతో పాటు గుంటూరు లోక్‌సభ సీటు కూడా వైసీపీదే అవుతుందని ఆయన జోస్యం చెప్పారు.