వీరి మధ్య రగడతోనే రీపోలింగా..?

చంద్రగిరి రీపోలింగ్ వివాదంలో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఇరుక్కున్నారు. ఆయన సూచనల మేరకే సీఈసీ ద్వివేదీ రీపోలింగ్‌కు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన సీఎస్‌ను కలిసి రీపోలింగ్ కోసం ఫిర్యాదు చేశారు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవాలని సీఎస్, ద్వివేదీకి లేఖ రాశారు. ఈ వివాదంపై స్పందించిన టీడీపీ.. చంద్రగిరిలో రీపోలింగ్ ప్రక్రియలో సీఎస్ జోక్యం స్పష్టమవుతోందని ఆరోపించింది. పోలింగ్ ముగిసిన 34 రోజుల […]

వీరి మధ్య రగడతోనే రీపోలింగా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 17, 2019 | 12:10 PM

చంద్రగిరి రీపోలింగ్ వివాదంలో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఇరుక్కున్నారు. ఆయన సూచనల మేరకే సీఈసీ ద్వివేదీ రీపోలింగ్‌కు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన సీఎస్‌ను కలిసి రీపోలింగ్ కోసం ఫిర్యాదు చేశారు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవాలని సీఎస్, ద్వివేదీకి లేఖ రాశారు.

ఈ వివాదంపై స్పందించిన టీడీపీ.. చంద్రగిరిలో రీపోలింగ్ ప్రక్రియలో సీఎస్ జోక్యం స్పష్టమవుతోందని ఆరోపించింది. పోలింగ్ ముగిసిన 34 రోజుల తర్వాత.. రీపోలింగ్ జరపడం విడ్డూరంగా ఉందని, తనకు సంబంధంలేని వ్యవహారంలో.. సీఎస్ ఎందుకు జోక్యం చేసుకున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.