సిద్ధమవుతున్న పీఆర్సీ నివేదిక… 29 శాతం ఫిట్‌మెంట్?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 29శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు పీఆర్సీ నివేదికను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. 2015లో వీరికి ఇచ్చిన 42శాతం ఫిట్‌మెంట్‌తో పోలిస్తే ఇది తక్కువే. ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 20శాతం మధ్యంతర భృతి వచ్చేనెల 1నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం 29శాతం ఫిట్‌మెంట్‌ను అమలుచేస్తే కనీస వేతనం రూ.21,000కు గరిష్ఠ వేతనం రూ.1,86,510కి చేరనుంది. దీనిప్రకారం రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ 3శాతానికి కొంచెం ఎక్కువగా ఉండనుంది. వార్షిక ఇంక్రిమెంట్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 29శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు పీఆర్సీ నివేదికను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. 2015లో వీరికి ఇచ్చిన 42శాతం ఫిట్‌మెంట్‌తో పోలిస్తే ఇది తక్కువే. ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 20శాతం మధ్యంతర భృతి వచ్చేనెల 1నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం 29శాతం ఫిట్‌మెంట్‌ను అమలుచేస్తే కనీస వేతనం రూ.21,000కు గరిష్ఠ వేతనం రూ.1,86,510కి చేరనుంది. దీనిప్రకారం రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ 3శాతానికి కొంచెం ఎక్కువగా ఉండనుంది. వార్షిక ఇంక్రిమెంట్ కనిష్ఠంగా రూ.640నుంచి గరిష్ఠంగా రూ.4,450కి పెరగనుంది. 10వ పీఆర్సీ ప్రకారం కనీస వార్షిక ఇంక్రిమెంట్ రూ.390ఉండగా, గరిష్ఠ వార్షిక ఇంక్రిమెంట్ రూ.2,520గా ఉంది. రాష్ట్ర ఉద్యోగులకు 11వ వేతన సవరణ సంఘాన్ని నియమిస్తూ 2018 మే 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ, జేఎన్‌టీయూల్లో బోధనేతర సిబ్బంది, వర్క్‌చార్జ్‌డ్ ఉద్యోగులు, ఫుల్‌టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు కమిషన్ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల బోధనా సిబ్బంది వ్యవహారాలు దీని పరిధిలోకి రావు.