ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్ష.. జగన్ మరో కీలక నిర్ణయం..!

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్ష.. జగన్ మరో కీలక నిర్ణయం..!
Follow us

| Edited By:

Updated on: May 02, 2020 | 3:44 PM

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కుటుంబంలో ఒకరికి కరోనా పరీక్ష నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా రెడ్‌ జోన్ మండలాల్లో దీన్ని అమలు చేయనున్నారు. ఈ క్రమంలో శనివారం ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అక్కడి గ్రామ వాలంటీర్లు తమ పరిధిలోని 50 కుటుంబాల్లో ఒక్కొక్కరి చొప్పున తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఈ ఫలితాలు రెండు రోజుల్లో రానున్నాయని అధికారులు చెప్పారు. కాగా ఏపీలో ఇప్పటివరకు 1,08,403 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,525 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31 మంది మరణించగా.. 1,051 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 441 మందికి కరోనా నెగిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయనున్నారు అధికారులు.

Read This Story Also: యూరప్‌ దేశాల్లో కరోనా విజృంభణ.. 15లక్షలు దాటేసిన కేసులు..!

ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.!
అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.!
నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి..
నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి..
ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే ఇలానే ఉంటది..
ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే ఇలానే ఉంటది..
ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.?
ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.?
ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి
ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి
ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్
భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్