AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు..తెలంగాణ‌లో 6

ఏపీలో క‌రోనా తీవ్ర‌త కొన‌సాగుతోంది. శ‌నివారం కొత్త‌గా మ‌రో 62 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1525కు పెరిగింది. కర్నూలులో అత్యధికంగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 33కు చేరింది. ఏపీలో గత 24 గంటల్లో 5943 నమూనాలను పరీక్షించగా.. 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది. బాధితుల్లో తాజాగా 38 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని, […]

ఏపీలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు..తెలంగాణ‌లో 6
Jyothi Gadda
|

Updated on: May 02, 2020 | 12:29 PM

Share
ఏపీలో క‌రోనా తీవ్ర‌త కొన‌సాగుతోంది. శ‌నివారం కొత్త‌గా మ‌రో 62 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1525కు పెరిగింది. కర్నూలులో అత్యధికంగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 33కు చేరింది.

ఏపీలో గత 24 గంటల్లో 5943 నమూనాలను పరీక్షించగా.. 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది. బాధితుల్లో తాజాగా 38 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని, దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 441 కు చేరుకుందని పేర్కొంది. వైరస్‌ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 33 మంది మరణించారని, గడిచిన 24 గంటల్లో ఎంటువంటి కోవిడ్‌ మరణాలు సంభవించలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1051 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు వెల్లడించింది. జిల్లాల వారీగా కరోనా బాధితులు, కోలుకున్నవారి వివరాలతో జాబితా విడుదలను చేసింది.

కృష్ణ జిల్లాలో 12, ,గుంటూరు 2 , అనంత‌లో 4, కడప 4,తూర్పు గోదావ‌రి జిల్లాలో 3, నెల్లూరు 6, ప్ర‌కాశంలో 1, విశాఖ‌లో 4, ప‌శ్చిమ గోదావ‌రిలో 1 కేసుల గడిచిన 24 గంటల్లో నమోదయ్యాయి. ఇక జిల్లాల వారిగా తీసుకుంటే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 436 కేసులు, గుంటూరు 306, కృష్ణా జిల్లాలో 258 కేసులు నమోదు న‌మోద‌య్యాయి. అనంత‌లో 71, చిత్తూరు లో 80. తూర్పు గోదావ‌రిలో 45,క‌డ‌ప‌లో 83, నెల్లూరు లో 90, ప్ర‌కాశంలో 61, శ్రీకాకుళంలో 5, విశాఖ 29, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 59 కేసులు ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోద‌య్యాయి.. ఎపిలోని 13 జిల్లాల‌కు గాను విజ‌య‌న‌గరం మిన‌హా మిగ‌తా 12 జిల్లాలు క‌రోనా భారీన ప‌డ్డాయి.

ఇటు, తెలంగాణ‌లో శుక్రవారం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,044 కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న 22 మంది ఈరోజు డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 463 మంది డిశ్చార్జ్ కాగా, 28 మంది కరోనా బారినపడి మరణించారని ఆయన వివరించారు. రాష్ట్రంలో లక్ష మందికి కూడా వైద్యం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని  మంత్రి ఈటల స్ప‌ష్టం చేశారు. కరోనా వైరస్  టెస్టులు చేయకపోవడం వల్లే తక్కువ కేసులు అనడం సరికాదన్నారు. ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేయొద్దని ఐసీఎంఆర్‌ చెప్పిందని ఈటల తెలిపారు.