క‌రోనా వేళ క‌ల్యాణం…క‌ర్ర‌ల‌తో దండ‌లు మార్చుకుని ఇలా..

క‌రోనా వేళ క‌ల్యాణం...క‌ర్ర‌ల‌తో దండ‌లు మార్చుకుని ఇలా..

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్ర‌త కొన‌సాగుతోంది. దీంతో కేంద్ర‌ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అనేక కార్య‌క్ర‌మాలు వాయిదా ప‌డ్డాయి. పెళ్లిళ్లు, ఇత‌రాత్ర శుభ‌కార్యాలు కూడా జ‌ర‌గ‌టం లేదు. ఒక‌వేళ పెట్టిన ముహూర్తానికి పెళ్లి చేయాల‌ని అనుకున్న వాళ్లు మాత్రం కేవ‌లం ముఖ్య‌మైన్న వారు ఏడుగురు, లేదా ప‌దిమందితోనే పెళ్లి పూర్తి చేస్తున్నారు. ఇక ర‌వాణా ఇబ్బందులు ఉన్న‌వారు ఆన్‌లైన్‌లేనే తాళి క‌ట్టేస్తున్నారు. మొన్న కేర‌ళ‌లో ఓ జంట […]

Jyothi Gadda

|

May 02, 2020 | 12:56 PM

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్ర‌త కొన‌సాగుతోంది. దీంతో కేంద్ర‌ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అనేక కార్య‌క్ర‌మాలు వాయిదా ప‌డ్డాయి. పెళ్లిళ్లు, ఇత‌రాత్ర శుభ‌కార్యాలు కూడా జ‌ర‌గ‌టం లేదు. ఒక‌వేళ పెట్టిన ముహూర్తానికి పెళ్లి చేయాల‌ని అనుకున్న వాళ్లు మాత్రం కేవ‌లం ముఖ్య‌మైన్న వారు ఏడుగురు, లేదా ప‌దిమందితోనే పెళ్లి పూర్తి చేస్తున్నారు. ఇక ర‌వాణా ఇబ్బందులు ఉన్న‌వారు ఆన్‌లైన్‌లేనే తాళి క‌ట్టేస్తున్నారు. మొన్న కేర‌ళ‌లో ఓ జంట వివాహ ఇలాగే జ‌రిగింది. వ‌ధువు ల‌క్నోలో ఉంటే, వ‌రుడు కేర‌ళ‌లో ఉండ‌గా ఫోన్‌కి తాళిక‌ట్టాడు. అవ‌త‌ల వ‌ధువు త‌ల్లి ఆమెకు మూడు ముళ్లు వేసింది. తాజ‌గా ఔరంగ‌బాద్‌లోనూ లాక్‌డౌన్ వేళ విచిత్ర వివాహం జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే…
ఔరంగ‌బాద్‌లో జ‌రిగిన ఓవివాహ వేడుక అంద‌రినీ ఆక‌ట్టుకుంది. క‌రోనా, లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా సామాజిక దూరం పాటించాల‌ని అధికారులు సూచిస్తుండ‌గా, అందుకు అనుగుణంగా పెళ్లి చేసుకుంది ఓ జంట‌. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు తూచ త‌ప్ప‌క పాటించిన ఆ వ‌ధువ‌రులు క‌ర్ర‌ల సాయంతో దండ‌లు మార్చుకుని అంద‌రి ఆశ్చ‌ర్యానికి గురిచేశారు. ఇప్పుడు వీరి పెళ్లి తంతూ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మార‌టంతో నెటిజ‌న్ల జోకులు, కామెంట్లు పేలిపోతున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu