శ్రీవారి భ‌క్తుల‌కు నిరాశే.. ఇకపై పరిమిత దర్శనాలే : టీటీడీ చైర్మన్

తిరుమ‌లేశుడి ద‌ర్శ‌నానికి రోజుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేస్తుంటారు. అయితే, ఇక‌పై తిరుమ‌ల‌లో

శ్రీవారి భ‌క్తుల‌కు నిరాశే.. ఇకపై పరిమిత దర్శనాలే : టీటీడీ చైర్మన్
Follow us
Jyothi Gadda

|

Updated on: May 02, 2020 | 1:29 PM

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్నవైర‌స్ ప్ర‌భావంతో తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం త‌లుపులు మూసివేశారు. క‌రోనా కార‌ణంగా ఆల‌యంలోకి భ‌క్తుల ప్ర‌వేశాలు నిషేధించిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు స్వామీ వారి నిత్య కైంక‌ర్యాలు య‌ధావిధిగా జ‌రుగుతున్నా..భ‌క్తుల‌ను మాత్రం వెంక‌న్న ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌టం లేదు. ఈ క్ర‌మంలో లాక్‌డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డంపై టీటీడీ ట్ర‌స్ట్ బోర్డు ప‌లు కీల‌క నిర్ణాయాలు తీసుకున్న‌ట్లుగా టీటీడీ చైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేర‌కు స్వామివారి ద‌ర్శ‌నాలు, భ‌క్తుల ర‌ద్దీని దృష్టిని ఉంచుకుని ప‌లు మార్పులు, చేర్పులు చేసిన‌ట్లుగా చెప్పారు. వివ‌రాల్లోకి వెళితే…
తిరుమ‌లేశుడి ద‌ర్శ‌నానికి రోజుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేస్తుంటారు. అయితే, ఇక‌పై తిరుమ‌ల‌లో ఒకేసారి  లక్షల మంది దర్శనాలు సాధ్యం కాదని టీటీడీ చైర్మ‌న్‌ ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాతే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పిన ఆయన లాక్ డౌన్ ఎత్తి వేసిన తరువాత కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా క్యూలైన్లలో మార్పులు ఉంటాయన్నారు. భక్తులకు మాస్కులు, శానిటైజర్లు వంటి సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు.   మీడియాతో మాట్లాడిన ఆయన  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఆయా ప్రభుత్వాల సూచన మేరకు మళ్లీ స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని స్ప‌ష్టం చేశారు.