టీటీడీ కీల‌క నిర్ణ‌యంః 1300 మంది కార్మికుల తొల‌గింపు !

దేశంలోనే సంప‌న్న దేవాల‌యం, అక్క‌డ కోలుదీరిన దేవ‌దేవుడు అప‌ర కుబేరుడు. శ్రీనివాసుడి నిల‌య‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం టీటీడీ  తీసుకున్న నిర్ణ‌యం ఒప్పంద కార్మికుల‌కు సంక‌టంగా మారింది. వంద‌ల మంది ఒప్పంద కార్మికుల‌ను టీటీడీ తొల‌గించింది. టీటీడీ ఆధ్వ‌ర్యంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామివారి దేవాల‌యంలో ప‌నిచేస్తున్న 13వంద‌ల మంది కాంట్రాక్ట్ కార్మికుల‌ను టీటీడీ తొల‌గించింది. వీరంతా తిరుమ‌ల‌లో పారిశుద్ధ్య కార్మికులుగా, మెయింటెనెన్స్ సిబ్బందిగా ప‌నిచేస్తున్నారు. అయితే, ఏప్రిల్ 30తో వారి ఒప్పందం గ‌డువు ముగిసిపోయింది. దీంతో వారిని […]

టీటీడీ కీల‌క నిర్ణ‌యంః 1300 మంది కార్మికుల తొల‌గింపు !
Follow us

|

Updated on: May 02, 2020 | 5:31 PM

దేశంలోనే సంప‌న్న దేవాల‌యం, అక్క‌డ కోలుదీరిన దేవ‌దేవుడు అప‌ర కుబేరుడు. శ్రీనివాసుడి నిల‌య‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం టీటీడీ  తీసుకున్న నిర్ణ‌యం ఒప్పంద కార్మికుల‌కు సంక‌టంగా మారింది. వంద‌ల మంది ఒప్పంద కార్మికుల‌ను టీటీడీ తొల‌గించింది.
టీటీడీ ఆధ్వ‌ర్యంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామివారి దేవాల‌యంలో ప‌నిచేస్తున్న 13వంద‌ల మంది కాంట్రాక్ట్ కార్మికుల‌ను టీటీడీ తొల‌గించింది. వీరంతా తిరుమ‌ల‌లో పారిశుద్ధ్య కార్మికులుగా, మెయింటెనెన్స్ సిబ్బందిగా ప‌నిచేస్తున్నారు. అయితే, ఏప్రిల్ 30తో వారి ఒప్పందం గ‌డువు ముగిసిపోయింది. దీంతో వారిని ఇక విధుల‌కు రావొద్దంటూ టీటీడీ అధికారులు చెప్పేశారు. దీంతో కార్మికులు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. టీటీడీ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల కార్మిక సంఘాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.
క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నిరోధించ‌డానికి మార్చి 20న దేవ‌స్థానాన్ని మూసివేసింది టీటీడీ. ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలోనే ఒప్పంద కార్మికుల గ‌డువు ముగిసిపోయింది. అయితే, కార్మికుల‌ను స‌ప్ల‌య్ చేసే సంస్థ దేవ‌స్థానంతో కుదుర్చుకున్న ఒప్పందం గ‌త నెల 30న ముగిసింద‌ని, దాన్ని కొన‌సాగించే అవ‌కాశం లేద‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే, ఆ కార్మికుల స‌మ‌స్య గురించి విచారిస్తున్నామ‌ని, వారికి స‌హాయ‌ప‌డే మార్గాల‌ను అన్వేషిస్తున్నామ‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు.