1400 కంపెనీలు ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి: సీఎం జగన్

1400 కంపెనీలు ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి అన్నారు. అధికారం చేపట్టి ఒక్క ఏడాది పూర్తైన సందర్భంగా

  • Tv9 Telugu
  • Publish Date - 7:27 am, Fri, 29 May 20
1400 కంపెనీలు ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి: సీఎం జగన్

1400 కంపెనీలు ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి అన్నారు. అధికారం చేపట్టి ఒక్క ఏడాది పూర్తైన సందర్భంగా అధికారులతో జగన్ హై లెవల్ మీటింగ్‌ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి అంశాలపై ఆయన మాట్లాడారు.

”ఏపీకి 972 కిలోమీటర్ల సముద్రతీరం, విస్తారమైన రైలు మార్గం, రోడ్డు కనెక్టివిటీ, నాలుగు ఓడరేవులు, ఆరు ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. చాలా కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. 1400 కంపెనీలు 11,549కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉన్నాయి. వీటితో పాటు 20 పెద్ద కంపెనీలు కూడా రాష్ట్రానికి రావడానికి ఆసక్తిని చూపుతున్నాయి. వైఎస్ఆర్ నవోదయ స్కీమ్‌ కింద ప్రభుత్వం ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. పరిశ్రమలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో చిన్న పరిశ్రమలు కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం” అని జగన్ అన్నారు.

అవినీతికి తావులేకుండా పారదర్శకమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నామని అది గర్వించాలని విషయమని సీఎం అన్నారు. పరిశ్రమలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని, వచ్చే వాటిని స్వాగతిస్తామని జగన్ చెప్పుకొచ్చారు. పరిశ్రమలు కావాల్సిన భూములను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా సీఎం వివరించారు. ప్రత్యేక హోదా నినాదానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు మరిన్ని రాయితీలు వచ్చే అవకాశం ఉందని జగన్ పేర్కొన్నారు.

Read This Story Also: సమంత, పూజా ఫ్యాన్స్ వార్.. నెట్టింట రచ్చ రచ్చ..!