తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం
హైదరాబాద్:బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి ఫణిగా పేరు పెట్టారు. శ్రీహరికోటకు ఆగ్నేయ దిశలో 1423 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1460 కిలోమీటర్ల తూర్పు దిశగా తుపాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. తీరంవైపు 45 కిలో మీటర్ల వేగంతో కదులుతున్నట్లు వెల్లడించారు. మరో 24 గంటల్లో పెనుతుపానుగా మారే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 30 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందని తెలిపారు. మరోవైపు తుపాను […]
హైదరాబాద్:బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి ఫణిగా పేరు పెట్టారు. శ్రీహరికోటకు ఆగ్నేయ దిశలో 1423 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1460 కిలోమీటర్ల తూర్పు దిశగా తుపాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. తీరంవైపు 45 కిలో మీటర్ల వేగంతో కదులుతున్నట్లు వెల్లడించారు. మరో 24 గంటల్లో పెనుతుపానుగా మారే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 30 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందని తెలిపారు. మరోవైపు తుపాను గమనాన్ని ఏపీలోని ఆర్టీజీఎస్, ఐఎండీ నిశితంగా గమనిస్తున్నాయి. తుపాను ప్రభావంతో రాగల 24 గంటల్లో తమిళనాడు, దక్షిణకోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
The Deep Depression intensified into Cyclonic Storm ‘FANI’ and lay centred at 11:30 IST, near lat 5.2°N and long 88.5°E, about 880 km from Trincomalee (Sri Lanka), 1250 km southeast of Chennai . It is very likely to intensify into a Severe Cyclonic Storm during next 24 hours. pic.twitter.com/xPx6HHqEt3
— India Met. Dept. (@Indiametdept) April 27, 2019