AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amaravati: మహోద్యమంగా సాగుతున్న మహాపాదయాత్ర – 2.. కాలయాపన చేసేందుకే సుప్రీంకోర్టుకు.. ప్రభుత్వంపై రైతులు ఫైర్

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే (Amaravati) కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర - 2 దిగ్విజయంగా కొనసాగుతోంది. అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా, చెదరని సంకల్పంతో..

Amaravati: మహోద్యమంగా సాగుతున్న మహాపాదయాత్ర - 2.. కాలయాపన చేసేందుకే సుప్రీంకోర్టుకు.. ప్రభుత్వంపై రైతులు ఫైర్
Amaravati Padayatra 2
Ganesh Mudavath
|

Updated on: Sep 18, 2022 | 6:41 AM

Share

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే (Amaravati) కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర – 2 దిగ్విజయంగా కొనసాగుతోంది. అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా, చెదరని సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగుతోంది. ఆరో రోజు ఐలవరం నుంచి మొదలైన పాదయాత్ర రేపల్లె నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. అమరావతి రైతులు రేపల్లెలోకి అడుగుపెట్టగానే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ (Satya Prasad) ఘన స్వాగతం పలికారు. మేళతాళాలు, డప్పులతో ఆహ్వానించారు. ఐలవరం నుంచి కనగాల, రాజవోలు మీదుగా నగరం వరకు పాదయాత్ర కొనసాగింది. రాజవోలు వద్ద వివిధ రాజకీయ పక్షాలు పాదయాత్రకు సంఘీభావం తెలిపాయి. ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అమరావతి రైతులకు మద్దతుగా కలిసి నడిచారు. కాగా.. ఇవాళ నగరం గ్రామం నుంచి తిరిగి రైతుల పాదయాత్ర మొదలుకానుంది. సెప్టెంబర్‌ 12న మొదలైన అమరావతి రైతుల పాదయాత్ర 60 రోజుల పాటు 9 వందల కిలోమీటర్లు పైగా సాగనుంది. రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాల రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. అమరావతి అభివృద్ధిపై మరింత ఆలస్యం చేయడం కోసమే ప్రభుత్వం ఆరు నెలల తర్వాత సుప్రీంలో సవాల్‌ చేసిందన్నారు.

అమరావతిపై ఎన్నో కేసులు వేసి ఎదురుదెబ్బలు తిన్న వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ అదే పునరావృతమవుతుందని రైతులు చెప్పారు. అమరావతి రైతుల పాదయాత్రకు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. న్యాయపోరాటంలో రైతులతే అంతిమ విజయమన్నారు. అమరావతి రైతుల పాదయాత్రలో.. పాదయాత్ర సాగిన మార్గాల్లోని గ్రామాలు మమేకం అయ్యాయి.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే రాజధాని అని ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరింది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని పిటిషన్ లో పేర్కొంది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్ లో యాడ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..