Ration Card Holder: కేంద్రం గుడ్‌న్యూస్.. రేషన్ కార్డు ఉన్నవారికి అద్భుతమైన ప్రయోజనం..!
Ration Card Holder: కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక రేషన్ కార్డు ఉన్నవారికి కూడా కరోనా నుంచి ఉచిత రేషన్ అందిస్తోంది...
Ration Card Holder: కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక రేషన్ కార్డు ఉన్నవారికి కూడా కరోనా నుంచి ఉచిత రేషన్ అందిస్తోంది. తాజాగా రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అంత్యోదయ రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్‌తో పాటు ఉచిత వైద్య సదుపాయం కూడా అందిస్తోంది. దీనిపై ప్రభుత్వం ప్రచారం కూడా నిర్వహిస్తోంది. అంత్యోదయ కార్డు హోల్డర్లందరికీ ఉచిత చికిత్స కోసం ఆయుష్మాన్ కార్డులను అందించాలని నిర్ణయించింది కేంద్రం.
ఈ సదుపాయాన్ని ప్రభుత్వం అనేక కేంద్రాలలో కల్పిస్తోంది. ఇందులో రేషన్ కార్డు చూపి జన్ సువిధ కేంద్రంలో ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తమ రాష్ట్ర అంత్యోదయ కార్డు హోల్డర్ల ఆయుష్మాన్ కార్డులను తయారు చేయాలని ఆదేశించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం కూడా రేషన్ కార్డుదారుల జాబితాను చూసి ఆయుష్మాన్ భారత్ కార్డులను తయారు చేస్తోంది. ప్రభుత్వం సెప్టెంబర్‌లో కూడా ఉచిత రేషన్ ఇస్తోంది. ఈ ఆయుష్మాన్ కార్డులను దేశ వ్యాప్తంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి