Andhra Pradesh: “చస్తే చావండి..కానీ లోన్ కట్టండి”.. యాప్ వేధింపులకు మరో యువకుడు మృతి
చస్తారా? అయితే చావండి. కానీ, లోన్ కట్టేసి చావండి అంటున్నాయి లోన్ యాప్స్. వేధింపులు భరించలేక కుమారుడు ఆత్మహత్య చేసుకుంటే, శవం తీయకముందే తల్లిదండ్రులకు ఫోన్‌చేసి వేధింపులకు దిగారు నిర్వాహకులు. లోన్ యాప్స్..
చస్తారా? అయితే చావండి. కానీ, లోన్ కట్టేసి చావండి అంటున్నాయి లోన్ యాప్స్. వేధింపులు భరించలేక కుమారుడు ఆత్మహత్య చేసుకుంటే, శవం తీయకముందే తల్లిదండ్రులకు ఫోన్‌చేసి వేధింపులకు దిగారు నిర్వాహకులు. లోన్ యాప్స్ ఆగడాలకు మరో ప్రాణం బలైపోయింది. లోన్ యాప్ వేధింపులు భరించలేక నంద్యాలలో బీటెక్ స్టూడెంట్ వీరేంద్ర సూసైడ్ చేసుకున్నాడు. బెంగళూరులో బీటెక్ సెకండియర్ చదువుతున్న వీరేంద్ర, లోన్ యాప్‌లో రుణం తీసుకున్నాడు. తిరిగి చెల్లించడంలో ఆలస్యం కావడంతో నిర్వాహకులు వేధింపులకు దిగారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి బంధువులు, ఫ్రెండ్స్‌కు పంపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వీరేంద్ర ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వీరేంద్ర సూసైడ్ చేసుకున్నా, లోన్ యాప్ వేధింపులు ఆగలేదు. అంత విషాదంలోనూ వీరేంద్ర తండ్రికి, కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్‌కూ ఫోన్లు చేస్తూనే ఉన్నారు. చస్తే చావండి, కానీ లోన్ కట్టేశాక చావండి అంటూ డేర్‌గా చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..