AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మంత్రుల రాజీనామా.. కాన్వాయ్‌ని వదిలేసి సాదాసీదాగా..
AP cabinet ministers gave resignation: ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా సాగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. కేబినెట్‌లో పాల్గొన్న మంత్రులు జగన్‌కు రాజీనామా లేఖలను కూడా అందించారు. మంత్రుల లెటర్ ప్యాడ్‌లను తీసుకున్న ప్రోటోకాల్ అధికారులు..
ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా సాగిన ఏపీ కేబినెట్(AP Cabinet) భేటీ ముగిసింది. కేబినెట్‌లో పాల్గొన్న మంత్రులు జగన్‌కు రాజీనామా లేఖలను కూడా అందించారు. మంత్రుల లెటర్ ప్యాడ్‌లను తీసుకున్న ప్రోటోకాల్ అధికారులు.. వాటిపై రాజీనామా టైప్ చేశారు. మంత్రుల సంతకాలు తీసుకుని వాటిని ముఖ్యమంత్రికి అందజేశారు. ఆ తర్వాత వాటిని గవర్నర్ కార్యాలయానికి పంపడం, ఈ రాత్రికే వాటి ఆమోదం కూడా లాంఛనం కాబోతోంది. 72 కాదు.. 74. కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఏపీలో రెవిన్యూ డివిజన్లు 72 కాదు… 74. మొన్నటి జిల్లాల విభజన తర్వాత కోనసీమ జిల్లాలో రామచంద్రాపురం, అమలాపురం రెండు డివిజన్లు ఉండేవి.
ఆ రెండింటితో పాటు ఇప్పుడు కొత్తగా కొత్తపేట డివిజన్‌ను కూడా ఏర్పాటు చెయ్యబోతున్నారు. ఇక మొన్నటి జిల్లా విభజన తర్వాత కడప జిల్లాలోనూ బద్వేల్, కడప, జమ్మలమడుగు రెవిన్యూ డివిజన్లు ఉండగా.. తాజాగా పులివెందుల డివిజన్‌ను కూడా ఏర్పాటు చేశారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ కి అభినందనలు తెలిపారు. అభినందనలు తెలుపుతూ క్యాబినెట్ తీర్మానం చేసింది. దీనితోపాటు మిలెట్ పాలసీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో.. డిగ్రీ కళాశాలలో 574 టీచింగ్ , నాన్ టీచింగ్ పోస్ట్ ల భర్తీకి ఆమోదం.
జడ్పీల కాల పరిమితి ముగిసే వరకు కొనసాగించేందుకు క్యాబినెట్ ఓకే చెప్పింది. పంచాయితి రాజ్ చట్టసవరణకు ఆమోదం తెలిపింది. ఏపి టూరిజం కార్పొరేషన్ కు రాజమండిలో 6 ఎకరాలు కేటాయింపు.
రాజమండ్రి, కర్నూలు, విజయనగరం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలలో ప్రభుత్వ హాస్పిటళ్లకు భూ కేటాయింపు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల లో పారిశ్రామిక పార్కకు 82 ఎకరాల భూ కేటాయింపు.
ఇవి కూడా చదవండి: Viral Video: మీరెక్కడ తయారయ్యార్రా బాబు… దెయ్యంతో డ్యాన్సేంటి.. వీడియో చూస్తే షాక్
Viral Video: కుక్కను కాకా పడుతున్న పిల్లి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..