AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆక్వా రైతులకు ఊరట.. ఏపీ నుంచి తిరిగి ప్రారంభంకానున్న ఎయిర్‌ కార్గో సేవలు.

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం ఎయిర్‌ పోర్ట్‌ల నుంచి కార్గో ఎగుమతి కార్యకలాపాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. పలు కారణాల వల్ల ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కార్గో సేవలను పూర్తిగా ఆపేశారు. దీంతో ఆక్వా రంగంతో పాటు మరికొన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. సుదూర ప్రాంతాలకు...

Andhra Pradesh: ఆక్వా రైతులకు ఊరట.. ఏపీ నుంచి తిరిగి ప్రారంభంకానున్న ఎయిర్‌ కార్గో సేవలు.
Cargo Services
Narender Vaitla
|

Updated on: Apr 11, 2023 | 4:08 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం ఎయిర్‌ పోర్ట్‌ల నుంచి కార్గో ఎగుమతి కార్యకలాపాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. పలు కారణాల వల్ల ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కార్గో సేవలను పూర్తిగా ఆపేశారు. దీంతో ఆక్వా రంగంతో పాటు మరికొన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. సుదూర ప్రాంతాలకు జరిగే ఎగుమతులు ఒక్కసారిగా ఆగిపోవడంతో వాణిజ్య వేత్తలతో పాటు ఆక్వా రైతులు సైతం ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ సివిల్ ఏవియేషన్‌ సెక్యూరిటీ నిబంధనల నేపథ్యంలో సేవలను నిలిపివేశారు.

అయితే ఈ విషయం తెలిసిన వెంటనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమస్యపై దృష్టిసారించారు. విశాఖ ఎయిర్ పోర్టు అధికారులతో సంప్రదించి కార్గో రవాణా ఆగిపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సివిల్ ఏవియేషన్ అధికారులతో, DG-BCAS , DG – ఎయిర్పోర్ట్ అధారిటీ కార్గో లాజిస్టిక్స్ (AAICLAS)లతో సంప్రదించారు. ఏపీలోని విమానాశ్రయాలకు ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ ద్వారా కార్గో సేవలను పునరుద్దరించే దిశగా అడుగులు వేశారు.

ఇందులో భాగంగానే ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ కుమార్ వెంటనే ఇండిగో యాజమాన్యంతో సంప్రదించి త్వరలో కార్గో సేవలను పునరుద్ధరన విషయంపై చర్చించారు. త్వరలోనే కార్గో సేవలు పునరుద్దదించనున్నామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రం నుంచి సుదూర ప్రాంతాలకు ఎగుమతుల విషయంలో కీలక పాత్ర పోషించే కార్గో సేవలు తిరిగి ప్రారంభం కానుండడంతో రైతులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!