అమెజాన్‌తో ఆదివాసీల అద్భుత ప్రయోగం.. అటవీశాఖ పాత్రే కీలకం..
అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు అద్భుతమైన ప్రతిభాపాటవాలు ఉంటాయి. వాటిని వెలికి తీసి, శిక్షణ ఇస్తే అడవులలో దొరికే వస్తువులతో అద్భుతమైన హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆశ్చర్యకర రీతిలో పలు రకాల హస్తకళా ఉత్పత్తులు చేయగలరు. వాటికి సరైన మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తే, అందులో అమెజాన్ లాంటి ప్లాట్ ఫార్మ్స్ అయితే ఇక తిరుగేముంటుంది. అలాంటి ప్రయత్నమే ఇది. విశాఖపట్నం డివిజన్‌లోని గిరిజన.. హస్తకళా కళాకారులకు ఆర్థిక అవకాశాలు, సాంస్కృతిక పరిరక్షణ, గిరిజన సమాజ అభివృద్ధి ద్వారా సాధికారత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఓ వినూత్న ప్రయోగం చేసింది.

అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు అద్భుతమైన ప్రతిభాపాటవాలు ఉంటాయి. వాటిని వెలికి తీసి, శిక్షణ ఇస్తే అడవులలో దొరికే వస్తువులతో అద్భుతమైన హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆశ్చర్యకర రీతిలో పలు రకాల హస్తకళా ఉత్పత్తులు చేయగలరు. వాటికి సరైన మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తే, అందులో అమెజాన్ లాంటి ప్లాట్ ఫార్మ్స్ అయితే ఇక తిరుగేముంటుంది. అలాంటి ప్రయత్నమే ఇది. విశాఖపట్నం డివిజన్‌లోని గిరిజన.. హస్తకళా కళాకారులకు ఆర్థిక అవకాశాలు, సాంస్కృతిక పరిరక్షణ, గిరిజన సమాజ అభివృద్ధి ద్వారా సాధికారత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఓ వినూత్న ప్రయోగం చేసింది. అమెజాన్ ఇండియాతో కలిసి పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రపంచ వినియోగదారులకు ప్రామాణికమైన హస్తకళా ఉత్పత్తులను అందించడానికి సంకల్పించింది. కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం మధ్యలో ఉన్న సంభువానిపాలెం కుగ్రామంలో నివసించే గిరిజన వర్గాల గొప్ప నైపుణ్యాన్ని అందిపుచ్చుకుని విస్తృత మార్కెటింగ్ కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యం.
గిరిజన బిడ్డలకు జీవనోపాధి లక్ష్యంగా..
స్థానిక గిరిజన కమ్యూనిటీలకు స్థిరమైన జీవనోపాధిని అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ చొరవతో ఈ భాగస్వామ్యం సాధ్యపడింది. దీనికితోడు సామాజిక బాధ్యత, సుస్థిరతపట్ల అమెజాన్ ఇండియా అంకితభావాన్ని మరొక్క సారి ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఈ భాగస్వామ్యం ప్రాథమిక లక్ష్యం.. అమెజాన్‌లో గిరిజనులు తయారు చేసే అటవీ ఉత్పత్తులను అమెజాన్ జాబితాలో అందించడం, ఆదాయాన్ని పెంచడం తద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాన్ని చూపట్టారు.
అమెజాన్ కరిగర్ ప్రోగ్రామ్‌లో భాగంగా శిక్షణ..
అమెజాన్ కరిగర్ ప్రోగ్రామ్‌లో భాగంగా గిరిజన సభ్యులకు విలువ కల్పించడంతో పాటు ప్యాకేజింగ్, బ్రాండింగ్‌లో సమగ్ర శిక్షణను అందిస్తుంది. వారి ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి నేరుగా అవకాశం కల్పిస్తుంది. ఇందులో భాగంగా అటవీ శాఖ ద్వారా ఈ-కామర్స్ హబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రైమరీ సెకండరీ ప్యాకేజింగ్, స్టోరేజ్, డిస్పాచ్, ఆర్డర్ ప్రాసెసింగ్‌తో సహా వివిధ కార్యకలాపాలకు ఈ హబ్ కీలకంగా పని చేస్తుంది. అమెజాన్ ఇండియా విశాఖపట్నం ఫారెస్ట్ డివిజన్ మధ్య జరిగిన ఎమ్ఒయు స్వదేశీ హస్తకళను పెంపొందించడానికి, సంస్కృతిని ప్రోత్సహించడానికి దోహదపడుతోంది. అలాగే జీవనోపాధిని పెంచడానికి. అమెజాన్ కరిగర్ వేదికైంది.
ఆవు పేడ కుండలు, మాస్క్‌లు, మొక్కల ఆధారిత ఉత్పత్తులు..
ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో ఆవు పేడ కుండలు, పేపర్-మాష్ మాస్క్‌లు, మొక్కల ఆధారిత రంగులను ఉపయోగించి తయారు చేసిన సాంప్రదాయ కళాకృతులను ప్రదర్శించే పోస్ట్‌కార్డ్‌లు, కొబ్బరి చిప్పలతో తయారు చేసిన ఉత్పత్తులు, వినియోగించని వెదురు పదార్ధాలతో అటవీ ఉత్పత్తులను తయారుచేసి ఆన్‌లైన్‌లో విక్రయించడంపై దృష్టి పెట్టారు. విశాఖ పట్నం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ అనంత్ శంకర్ టీవీ9 తో మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలోని విశాఖపట్నం డివిజన్ వివిధ ప్రయత్నాల ద్వారా గిరి పుత్రుల జీవితాలను మెరుగుపరచడం కోసం స్థానిక అటవీ ఆధారిత వర్గాలతో కలిసి పని చేస్తోంది. వీరిలో ముఖ్యంగా మహిళా నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, పని చేయడానికి సురక్షితమైన స్థలాన్ని అందించడం తమ లక్ష్యంగా చెప్పారు.
పర్యావరణ – పర్యాటక హిత కేంద్రం ఏర్పాటు..
ఇందుకోసం తూర్పు కనుమల జీవవైవిధ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇక్కడ ప్రకృతి వివరణ కేంద్రం, ఆర్కిడేరియం, రాశి వాన్, ఔషధవన్, ఫికస్ గార్డెన్, బంబూసేటం వంటి పర్యావరణ,పర్యాటక వర్క్‌షాప్ కూడా స్థాపించబడిందని వివరించారు. ఈ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం మధ్యలో నివసించే గిరిజన సమాజానికి గేమ్-ఛేంజర్ కాబోతోందని తన భావనను వ్యక్తం చేశారు ఫారెస్ట్ ఆఫీసర్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




