AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బయలుదేరగానే ఆగిన రైలు.. ఒక్కసారిగా ప్రయాణికుల్లో ఆందోళన.. చివరకు జరిగిందిదే..

విశాఖ రైల్వే స్టేషన్.. ఉదయం ఆరు గంటల ప్రాంతం.. రోజూ మాదిరిగానే 12805 విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్లాట్ ఫాంపై ఆగి ఉంది. ప్రయాణికులు అంతా రైలెక్కుతున్నారు. ఇంతలో సమయం 6.15 సిబ్బంది అంతా సిద్ధామాయ్యారు. డ్రైవర్, లోకో పైలట్, గార్డ్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారు. 6.20కాగానే రైలు వెళ్ళేందుకు సిగ్నల్ అందింది. ట్రైన్ మెల్లగా ప్రారంభమవతోంది.

బయలుదేరగానే ఆగిన రైలు.. ఒక్కసారిగా ప్రయాణికుల్లో ఆందోళన.. చివరకు జరిగిందిదే..
Janmabhoomi Experss
Maqdood Husain Khaja
| Edited By: Srikar T|

Updated on: May 22, 2024 | 8:31 PM

Share

విశాఖ రైల్వే స్టేషన్.. ఉదయం ఆరు గంటల ప్రాంతం.. రోజూ మాదిరిగానే 12805 విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్లాట్ ఫాంపై ఆగి ఉంది. ప్రయాణికులు అంతా రైలెక్కుతున్నారు. ఇంతలో సమయం 6.15 సిబ్బంది అంతా సిద్ధామాయ్యారు. డ్రైవర్, లోకో పైలట్, గార్డ్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారు. 6.20కాగానే రైలు వెళ్ళేందుకు సిగ్నల్ అందింది. ట్రైన్ మెల్లగా ప్రారంభమవతోంది. ఇంతలోనే ఒక్కసారిగా అలజడి..! భోగీలు.. 12805 విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. సాంకేతిక లోపాన్ని ఆలస్యంగా గుర్తించారు రైల్వే సిబ్బంది. అయితే అప్పటికే బయలుదేరేందుకు రైలు అన్ని సిగ్నల్స్ అందుకుంది. ఉదయం 6.20 గంటలకు విశాఖ నుంచి లింగంపల్లికి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరాల్సి ఉంది. అయితే.. కాస్త ముందుకెళ్లి.. ఆ తరువాత ఆగిపోయింది. రెండు కోచ్లలో ఏసీ సమస్యతో పాటు కప్లింగ్ ఫెయిల్యూర్ అయినట్టుగా తెలుస్తోంది.

ఆ రెండు కోచ్‎లను తొలగించి.. మరో రెండు జోడించి..

సాంకేతిక లోపం ఉన్న రెండు కోచ్‎లను మరమ్మతులు చేయాలని తొలిత భావించారు అధికారులు. అయితే మళ్లీ మధ్యలో ఎక్కడైనా సమస్య తలెత్తే అవకాశం ఉందని భావించి ఏకంగా రెండు కోచ్‎లను రీప్లేస్ చేయాలని నిర్ణయించారు. ట్రైన్ కు ఉన్న ఆ రెండు కోచ్‎లను తొలగించిన రైల్వే సిబ్బంది.. యార్డ్ నుంచి మరో రెండు భోగిలను తెప్పించి ట్రైన్‎కు జోడించారు. రెండు కోచ్‌లను మార్చిన తర్వాత రైలు దాని గమ్యస్థానానికి బయలుదేరుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు. దాదాపు మూడు గంటల తరువాత రైలు 9.30కి విశాఖ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. రైలు ఆలస్యంతో రైల్వేస్టేషన్‎లోనే ప్రయాణికులు పడిగాపులుగాశారు. ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అసలు అక్కడ ఏం జరిగింది ..?

ఉదయం 6:20 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ లింగంపల్లికి బయలుదేరింది. క్షణాల్లోనే ఒకసారిగా ఆగిపోయింది. ఏం జరిగిందో ఎవరికి తెలియలేదు. ఆగిన తర్వాత కొంతమంది రైలు దిగారు. దీంతో ఆ రైలు రెండు భాగాలుగా విడిపోయిందని అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. కోచ్‎ల మధ్య ఉన్న కప్లింగ్ తెగిపోయిందన్నారు. అక్కడే ఏసీ కోచ్‎లలో సాంకేతిక సమస్య కూడా తలెత్తింది. అధికారులు ఒకసారిగా అప్రమత్తమై.. మళ్లీ కోచ్‎లను సరిదిద్దే ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. దీంతో.. ఆ రైలు నుంచి రెండు భోగిలను తప్పించి మరో రెండు భోగిలను జోడించారు. రైలు బయలుదేరిన క్షణాల్లోనే ఇలా జరిగింది కాబట్టి సరిపోయింది. రన్నింగ్‎లో ఏదైనా ఎటువంటి సమస్య తలెత్తితే ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు కొంతమంది ప్రయాణికులు. అయితే.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక సమస్యపై రైల్వే అధికారులు ఓ ప్రకటన చేశారు. 12805 విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లోని ఎం-1, డి-1 కోచ్‌లలో సాంకేతిక లోపం తలెత్తడంతో వాల్టెయిర్ డివిజన్ అధికారులు వేగంగా స్పందించారన్నారు. సమాచారం అందుకున్న డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ వెంటనే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి కోచ్‌లను మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. రెండు కోచ్‌ల రీప్లేస్‌మెంట్ సమర్ధవంతంగా జరిగిన తరువాత రైలు 09:30 గంటలకు తన ప్రయాణాన్ని పునఃప్రారంభించిందని తెలిపారు. రైలు సుమారు 3 గంటలు ఆలస్యమైంది. విద్యుత్ కనెక్షన్ కప్లర్‌లో లోపాన్ని సాంకేతిక సిబ్బంది గుర్తించిన వెంటనే రైలు బయలుదేరే ముందు స్టేషన్‌లో నిలిపివేశారు. కోచ్ డిపో నుంచి స్పేర్ కోచ్‌లను తెప్పించి వాటిని మార్చారు. ప్రయాణీకుల భద్రత, సౌలభ్యం అత్యంత ప్రాధాన్యతగా ఉంటుందని, ప్రయాణ సమయంలో తలెత్తే ఏవైనా సాంకేతిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి ప్రయత్నం జరుగుతుందని DRM తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..