Andhra Pradesh: తీవ్ర విషాదం.. బస్సు అందుకోవాలని చేసిన ప్రయత్నమే తల్లి ప్రాణాలు తీసింది!

నల్లపాడు నుండి పేరేచర్ల వైపు బైక్ దూసుకుపోతుంది. ధనుష్ బస్సును క్యాచ్ చేయాలని బైక్ ను వేగంగా నడుపుతున్నాడు.

Andhra Pradesh: తీవ్ర విషాదం.. బస్సు అందుకోవాలని చేసిన ప్రయత్నమే తల్లి ప్రాణాలు తీసింది!
Bike Accident
Follow us
T Nagaraju

| Edited By: Balaraju Goud

Updated on: Nov 15, 2024 | 7:30 AM

సకాలంలో ఆఫీసుకు చేరాలంటే, ఆ బస్సు ఎక్కాల్సిందే..! అయితే ఆ బస్సు కొద్దీ క్షణాల ముందే స్టాఫ్ దాటి వెళ్ళిపోయింది. తర్వాత బస్ స్టాఫ్ లో నైనా బస్సు అందుకోవాలనే ప్రయత్నం అ మహిళ ప్రాణాలే తీసింది. అసలేం జరిగిందంటే..!

గుంటూరుకు చెందిన భార్యాభర్తలు శ్రీకాంత్, సుస్మిత.. పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే శ్రీకాంత్ 2009లో గుండెపోటు కారణంగా చనిపోయారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంతో కారుణ్య నియామకం కింద సుస్మిత ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆమె పల్నాడు జిల్లా మాచర్లలోని కాసు బ్రహ్మానందరెడ్డి కాలేజ్ లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అక్కడే ఒక రూంలో ఉంటున్నారు.

అయితే ఆమె కొడుకు ధనుష్ వాత్సవ్ గుంటూరు సమీపంలోని నల్లపాడులో చదువుకుంటున్నాడు. అప్పుడప్పుడు కొడుకును చూసేందుకు సుస్మిత నల్లపాడు వచ్చి వెలుతుంటుంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే బుధవారం(నవంబర్‌ 13) కూడా కొడుకును చూసేందుకు నల్లపాడు వచ్చింది. గురువారం తిరిగి విధులకు హాజరయ్యేందుకు మాచర్ల వెళ్ళటానికి సిద్దమైంది. అయితే ఆమె నల్లపాడు బస్ స్టాఫ్ కు వచ్చేసరికి అప్పుడే మాచర్ల బస్సు వెళ్ళిపోయినట్లు చెప్పారు. దీంతో కొడుకు ధనుష్ తో నెక్ట్స్ స్టాఫ్ అయిన పేరేచర్లలో తనను దించాలని కోరింది. అక్కడే మాచర్ల బస్సు ఎక్కుతానని చెప్పింది. దీంతో ధనుష్ తన తల్లిని బైక్ పై ఎక్కించుకున్నాడు.

నల్లపాడు నుండి పేరేచర్ల వైపు బైక్ దూసుకుపోతుంది. ధనుష్ బస్సును క్యాచ్ చేయాలని బైక్ ను వేగంగా నడుపుతున్నాడు. మరోవైపు బస్సు అందుతుందో లేదో అన్న ఆతృతలో సుస్మిత ఉంది. ఈ సమయంలోనే ఆమె చీర కొంగు బైక్ చెయిన్ స్పాకెట్స్ లో చిక్కుకుంది. దీంతో ఆమె‌ వేగంగా వెలుతున్న బైక్ పై నుండి పడిపోయింది. వేగంగా వెళ్తున్న బండిపై నుండి పడటంతో ఆమెకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయింది. తల్లి మరణాన్ని తట్టుకోలేక ధనుష్ తల్లడిల్లిపోయాడు. అప్పుడు తండ్రిని, ఇప్పుడు తల్లిని కోల్పోయిన అతని బాధ వర్ణనాతీతంగా మారింది.

బస్సు అందుకోవాలని చేసిన ప్రయత్నమే తన తల్లి ప్రాణాలు తీసిందని ధనుష్ రోదిస్తూ చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మేడి కొండూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బైక్ పై ప్రయాణించేటప్పుడు వెనుక కూర్చోని ప్రయాణించే మహిళలు జాగ్రత్తగా ఉండాలని లేదంటే ఇటువంటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందంటున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..