AP: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కొత్త పెన్షన్‌ దరఖాస్తులు, ఎప్పటి నుంచంటే..

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త పెన్షన్‌దారుల కోసం కీలక ప్రకటన చేసింది. కొత్త పెన్షన్‌కోసం ఎదురు చూస్తున్న వారి నుంచి వచ్చే నెల మొదటి వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి విదివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది..

AP: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కొత్త పెన్షన్‌ దరఖాస్తులు, ఎప్పటి నుంచంటే..
Ntr Bharosa Pension
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 15, 2024 | 7:04 AM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన పని సామాజిక పెన్షన్లను పెంచడం. ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పేరుతో ప్రభుత్వం వెంటనే పెన్షన్‌లను రూ. 4 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా 2024 ఏప్రిల్‌ నుంచి పెన్షన్ల బకాయిలను చెల్లించారు. కాగా ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ కింద ప్రస్తుతం మొత్త 64,14,174 మంది పెన్షన్‌ పొందుతున్నారు.

వృద్ధులు, దివ్యాంగులు, తలసేమియా బాధితులు ఇలా మొత్తం 26 రకాల వ్యక్తులకు పెన్షన్‌ అందుతోంది. కాగా ఏపీ ప్రజలు కొత్త పెన్షన్ల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్ల దరఖాస్తులు ఎప్పుడి నుంచి ఉంటాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే తాజాగా ఇందుకు ఓ సంబంధించి ఓ గుడ్‌ న్యూస్‌ తెలుస్తోంది. ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి తాజాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కీలక ప్రకటన చేశారు. అర్హులైన పెన్షన్‌దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 1 తర్వాత గ్రామ లేదా వార్డ్ సచివాలయానికి వెళ్లి, పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి. అయితే త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి విధివిధానాలను ప్రకటించనున్నారు.

ఇక పెన్షన్‌ దారులు గ్రామంలో ఒకటి, రెండు నెలలు లేకపోయినా వచ్చే నెలలో పెన్షన్‌ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే నకిలీ ధృవపత్రాలతో ఎవరైనా అనర్హులు పెన్షన్‌ తీసుకుంటునట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..