ప్రతి గ్రామంలో ఒక మహిళ రూపంలో పోలీసు ప్రతినిధి ఉండాలనే ‘సంరక్షణ కార్యదర్శి’ అనే 15 వేల పోస్టులు సృష్టించాం : ఏపీ డీజీపీ

మహిళా పోలీసులు ఇప్పుడు గ్రామంలో విధులు నిర్వహిస్తుండడంతో తమకు పూర్తి స్థాయిలో రక్షణ ఉన్నదన్న భరోసా తో..

ప్రతి గ్రామంలో ఒక మహిళ రూపంలో పోలీసు ప్రతినిధి ఉండాలనే 'సంరక్షణ కార్యదర్శి' అనే 15 వేల పోస్టులు సృష్టించాం : ఏపీ డీజీపీ
Ap Dgp
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 05, 2021 | 9:20 PM

AP DGP: మహిళా పోలీసులు ఇప్పుడు గ్రామంలో విధులు నిర్వహిస్తుండడంతో తమకు పూర్తి స్థాయిలో రక్షణ ఉన్నదన్న భరోసా తో మహిళలు ఉన్నారని.. గ్రామంలో పోలీస్ స్టేషన్ యొక్క విస్తరించిన మరో అస్త్రం ఈ మహిళా పోలీసు అని ఏపీ డీజీపీ తెలిపారు. వారికి పోలీసు శాఖ అధికారాలు, విధులు త్వరలో ఇవ్వబోతున్నామన్నారు. మహిళా సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తూ మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమయ్యే దిశగా ముందుకు కదులుతున్నాయన్నారు. ప్రతి గ్రామంలో ఒక మహిళ రూపంలో పోలీసు శాఖ ప్రతినిధి ఉండాలనే ఉద్దేశ్యంతో, గ్రామ సచివాలయంలో గ్రామ/ వార్డ్ మహిళ సంరక్షణ కార్యదర్శి అనే పోస్ట్ ను సృష్టించి సుమారు 15, 000 మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగిందని డీజీపీ చెప్పారు.

వీరి సేవలను మరింత విస్తృత పరచాలన్న ఉద్దేశ్యంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళ పోలీస్ గా గుర్తిస్తూ ఈ మధ్యనే ఉత్తర్వులను జారీ చేసిందని డీజీపీ పేర్కొన్నారు. పోలీసు శాఖ ప్రతినిధిగా, మహిళా పోలీస్ లు ప్రతి ఇంటి గడప వద్దకు వెళ్లి అద్భుతమైన సేవలను అందిస్తున్నారు.. ఇప్పటికే, 20 లక్షల మంది పైగా మహిళలు దిశా యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవడం లో ప్రముఖ పాత్రను పోషించారు అని డీజీపీ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా, ఎపి పోలీస్ సేవా యాప్ ద్వారా 96 పోలీస్ సేవలను అందిస్తున్నారని గౌతం సవాంగ్ చెప్పుకొచ్చారు.

గ్రామ/వార్డు సచివాలయాలకు అనుసంధానంగా ఇప్పుడు మహిళా పోలీసులు గ్రామంలో విధులు నిర్వహిస్తుండడంతో తమకు పూర్తి స్థాయిలో రక్షణ ఉన్నదన్న భరోసా తో మహిళలు ఉన్నారని.. గ్రామంలో పోలీస్ స్టేషన్ యొక్క విస్తరించిన మరో అస్త్రం ఈ మహిళా పోలీసు అని డీజీపీ తెలిపారు. వారికి పోలీసు శాఖ అధికారాలు, విధులు త్వరలో ఇవ్వబోతున్నామన్నారు. పోలీసు శాఖలో శిక్షణ అనేది కీలకమైన అంశం అన్న విషయాన్ని గుర్తించాలన్న డీజీపీ.. కఠోర శిక్షణ ఆంధ్రప్రదేశ్ పోలీసు ను అత్యున్నత స్థానంలో నిలబెడుతోందన్న విషయం మనకందరికీ తెలిసిందేనన్నారు.

అందుకే ఈ మహిళ పోలీసు లకు కూడా అత్యున్నత శిక్షణ ఇచ్చేందుకు పూనుకొన్నామని DGP తెలిపారు. ఇప్పటికే వీరికి ప్రాధమిక శిక్షణ పూర్తయ్యింది.. విడతల వారిగా వీరికి క్యాప్సూల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం అని డీజీపీ స్పష్టం చేశారు. పోలీసు శాఖ లో పోస్టుల రిక్రూట్ మెంట్ పై అపోహలు, అనుమానాలు వద్దని గౌతమ్ సవాంగ్ చెప్పారు.

Read also: ఇక్కడ పోటీ చేయాలని ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు. కానీ.. యూపీలో ఏకంగా జిల్లా పీఠాన్నే కైవసం చేసుకుంది. ఇంతకీ ఎవరీమె.?