AP Deputy CM : ఏపీ డిప్యూటీ తన అతి వినయంతో సీఎం జగన్మోహన్ రెడ్డికి చిరాకొచ్చేంత పనిచేశాడు.. అది ఏమా కథ..?

అయ‌నో ఉప‌ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి త‌రువాత అంత‌టి ప‌ద‌వి. అంతే కాదు.. అయ‌న ముఖ్యమంత్రి క‌న్నా వ‌య‌స్సులో పెద్దవాడు. అయితేనేం, అయ‌న త‌న‌ క‌న్నా చిన్నవాడైనా ముఖ్యమంత్రి..

AP Deputy CM : ఏపీ డిప్యూటీ తన అతి వినయంతో సీఎం జగన్మోహన్ రెడ్డికి చిరాకొచ్చేంత పనిచేశాడు.. అది ఏమా కథ..?
Ap Dy Cm Narayana Swami
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 05, 2021 | 8:38 PM

Andhra Pradesh Deputy CM Narayana Swami : అయ‌నో ఉప‌ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి త‌రువాత అంత‌టి ప‌ద‌వి. అంతే కాదు.. అయ‌న ముఖ్యమంత్రి క‌న్నా వ‌య‌స్సులో పెద్దవాడు. అయితేనేం, అయ‌న త‌న‌ క‌న్నా చిన్నవాడైనా ముఖ్యమంత్రి కాళ్లపై ప‌డ‌బోయాడు. సియం వారిస్తున్నా.. మ‌రి వంగివంగి దండాలు పెట్టాడు. ఉప‌ ముఖ్యమంత్రి ప్రవ‌ర్తన పై అక్కడ ఉన్న వాళ్లంతా అవాక్కయ్యారు.. త్వర‌లో మంత్రి వ‌ర్గ విస్తర‌ణ అంటూ వార్తలు వ‌స్తున్న నేప‌ధ్యంలో.. త‌న ప‌ద‌విని కాపాడుకోవడానికే అయ‌న ముఖ్యమంత్రి కాళ్లమీద ప‌డ్డాడా? ఇంతకీ ఎవ‌రా ఉప‌ముఖ్యమంత్రి? ఎక్కడ ఈ తంతు జ‌రిగింది?

విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణానది క‌ర‌క‌ట్ట రోడ్డు విస్తర‌ణ ప‌నుల‌కు సియం జ‌గ‌న్మోహన్ రెడ్డి గ‌త నెల 30న శంఖుస్థాప‌న చేశారు. ఆ శంఖుస్థాప‌న కార్యక్రమంలో ప‌లువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్లొన్నారు. అయితే, ఇక్కడే ఒక ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది. అదే రోజు క్యాబినెట్ ఉండ‌టంతో.. ముందుగా క‌ర‌క‌ట్ట విస్తర‌ణ ప‌నులకు శంఖుస్థాప‌న చేసి అనంత‌రం కేబినెట్ మీటింగ్ కు సియం హ‌జ‌ర‌వ్వాల్సి ఉంది. సియం జ‌గ‌న్ క‌ర‌క‌ట్ట వ‌ద్ద చేరుకోని కారు దిగిన సియం జ‌గ‌న్ కు ఒక్కోక్కరు చోప్పున పుష్పగుచ్చాలిచ్చి స్వాగ‌తం ప‌లుకుతున్నారు. కొంద‌రి త‌రువాత ఉప‌ముఖ్యమంత్రి నారాయ‌ణ స్వామి వంతు వ‌చ్చింది. ఇంత‌లోనే సియం జ‌గ‌న్ కు న‌మ‌స్కరించి..అనంత‌రం సియం కాళ్ల మీద ప‌డ‌బోయాడు డిప్యూటీ. అలా చేయోద్దని సియం వారించినా విన‌కుండా ఇలా మూడు సార్లు చేశారు. దీంతో సియం జ‌గన్.. డిప్యూటీ నారాయ‌ణ స్వామీ పై తీవ్ర అసహ‌నం వ్యక్తం చేశారు.. అన్నా.. మీరు నాక‌న్నా పెద్దవారు మీరు అలా చేయ‌కూడ‌దని వారించారు.

మంత్రి వ‌ర్గం కొలుదీరిన రోజే సియం జ‌గ‌న్.. మంత్రుల‌కు రెండున్నర సంవ‌త్సరాలే మీ ప‌ద‌వులు.. ప‌ని విధానం బట్టే పొడిగింపు అని ప్రక‌టించారు. ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కార్ కొలువు దీరి రెండేళ్లు పూర్తయ్యి మూడో ఏడు న‌డుస్తోంది. దీంతో త్వర‌లో మంత్రి వ‌ర్గ విస్తర‌ణ ఉంటుంద‌న్న ప్రచారం జ‌రుగుతుంది. ఈ తరుణంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి గా ఉన్న నారాయ‌ణ స్వామి త‌న క‌న్న చిన్న వాడైన సియం జ‌గ‌న్ కాళ్ల మీద పడ‌టం వెనుక మంత్రి ప‌ద‌వి ఊడుతుందేమోన‌న్న భ‌యం ప‌ట్టుకుంద‌ని ప్రచారం జ‌రుగుతుంది.

ఇప్పటికే నారాయణ స్వామి మంత్రిగా ఉన్నప్పటికీ అయ‌న‌కు కేటాయించిన శాఖ‌ల్లో ఏమి జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. అదే స‌మ‌యంలో అయ‌న క్రింద డిపార్ట్ మెంట్ హెడ్స్ ఎవ‌రూ అయ‌న మాట విన‌డం లేద‌ని ప్రచారం. దీంతో అయ‌న స‌రిగా ప‌ని చేయ‌డం లేద‌ని.. డిపార్ట్ మెంట్ ను అధికారులే న‌డిపిస్తున్నార‌ని భోగట్టా. త్వర‌లో మంత్రి వ‌ర్గ విస్తర‌ణ జ‌రిగితే, అయ‌న ప‌ద‌వికి గండం త‌ప్పద‌ని ఊహాగానాలు. సియం కాల్మొక్కితే క‌నిక‌రిస్తారేమ‌ని అయ‌న అలా చేసుంటాడ‌ని స‌చివాల‌యంలో వినిపిస్తోన్న మాట.

వి. శ్రీనివాస్, టీవీ9 ప్రతినిధి

Read also: Bonalu – Bakrid Festivals: పశు రవాణాపై తెలంగాణ డీజీపీ కీలక ఆదేశాలు

డయాబెటిస్‌తో పాటు ఆ సమస్యలున్నాయా..? ఈ దివ్యఔషధం మీకోసమే..
డయాబెటిస్‌తో పాటు ఆ సమస్యలున్నాయా..? ఈ దివ్యఔషధం మీకోసమే..
కొబ్బరికాయలో పువ్వు వస్తే వదలకుండా తినేయండి..ఆరోగ్య ప్రయోజనాలు
కొబ్బరికాయలో పువ్వు వస్తే వదలకుండా తినేయండి..ఆరోగ్య ప్రయోజనాలు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో రాజకీయ వేడి..
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో రాజకీయ వేడి..
సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..
సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..