Visakhapatnam: ఇద్దరు కూతుళ్లకు ఉరి వేసి తండ్రి సూసైడ్.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు..
విశాఖపట్నంలోని కంచరపాలెం గంగానగర్ లో ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో... పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్పుల బాధతోనే పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా...

విశాఖపట్నంలోని కంచరపాలెం గంగానగర్ లో ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో… పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్పుల బాధతోనే పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఏడేళ్లుగా ఇద్దరు పిల్లలతో కలిసి ప్రసాద్ అనే వ్యక్తి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి పదమూడేళ్ల బిందు, పదిహేనేళ్ల భార్గవి ఉన్నారు. ప్రసాద్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య 2013 లో అనారోగ్యంతో మృతి చెందింది. భార్య చనిపోయినా.. ఏ లోటు లేకుండా పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఇద్దరు పిల్లలకు గత ఆరు నెలలుగా స్కూలుకు పంపించలేదు. ఈ క్రమంలో అప్పుల బాధ తట్టుకోలేక కూతుళ్లకు ఉరి వేసి అనంతం ప్రసాద్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖలో పెను సంచలనం కలిగించింది.
కాగా.. విశాఖ కంచరపాలెంలోని పాత రామారావు ఆస్పత్రి సమీపంలోని గంగన్ననగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పదంగా చనిపోయారు. వీరని తండ్రీ కూతుళ్లుగా గుర్తించారు. ప్రసాద్ ఫ్యాన్‌కు ఉరేసుకోగా.. బిందుమాధవి, భార్గవి నేలపై విగతజీవులుగా పడి ఉన్నారు. ప్రసాద్ తల్లి అనసూయ.. కుమారుడి ఇంటికి వచ్చారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో ప్రసాద్ కు ఫోన్ చేశారు. అయితే ఫోన్ కలవలేదు. దీంతో స్థానికుల సహాయంతో డయల్ 100కి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని.. తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ముగ్గురూ చనిపోయి ఉండటాన్ని గుర్తించారు.
ఆర్థిక ఇబ్బందులతో పాటు.. ప్రసాద్‌పై గతంలో చోరీ కేసు కూడా ఉంది. దీంతో అతను తీవ్ర మానసిక వేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాకే నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..