AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ మూగజీవాల కోసం గుండెలవిసేలా రోధిస్తున్న ఓ రైతు కుటుంబం.. కారణమిదే..!

అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్కవరం గ్రామంలో అద్దిపెళ్లి వెంకటరమణ అనే రైతు.. ఇంటి నిర్మాణం ఇసుక కోసం శారదా నదికి వెళ్ళాడు. తన ఎడ్లబండి మీద వెళ్లి శారదా నదిలో ఇసుక లోడ్ చేసుకుని తిరిగి బయలుదేరాడు. ఈ క్రమంలో నోటిలో ఉన్న భారీ గొయ్యను అంచనా వేయలేక.. ప్రమాదవశాత్తు ఎద్దుల బండి శారద నదిలో మునిగిపోయింది. మునిగిపోయిన ఎడ్ల బండి వెలికి తీసేందుకు అదే గ్రామానికి చెందిన గజ ఇతగాడు నేమాలేశ్వరరావు అతికష్టం మీద శ్రమించి నీటి లోపలికి వెళ్లాడు.

Andhra Pradesh: ఆ మూగజీవాల కోసం గుండెలవిసేలా రోధిస్తున్న ఓ రైతు కుటుంబం.. కారణమిదే..!
Former
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Nov 22, 2023 | 9:00 PM

Share

Andhra Pradesh: అతనో పేద రైతు.. పశువులను జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నాడు. అందుకోసమే తనకు తిండి పెడుతున్న ఆ పశువులను ప్రాణంగా పెంచుకుంటున్నాడు. ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానంగా ఆలనా పాలన చూసుకుంటున్నాడు. కుటుంబ సభ్యులుగా మారిపోవడంతో ఆ మూగజీవాలో వాళ్లతో బంధాన్ని పెనవేసుకున్నయి. మరి అంత ప్రేమగా పెంచుకుంటున్న ఆ మూగజీవులు కళ్ళముందే ఒక్కసారిగా..

అసలు విషయం ఇదే..!

అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్కవరం గ్రామంలో అద్దిపెళ్లి వెంకటరమణ అనే రైతు.. ఇంటి నిర్మాణం ఇసుక కోసం శారదా నదికి వెళ్ళాడు. తన ఎడ్లబండి మీద వెళ్లి శారదా నదిలో ఇసుక లోడ్ చేసుకుని తిరిగి బయలుదేరాడు. ఈ క్రమంలో నోటిలో ఉన్న భారీ గొయ్యను అంచనా వేయలేక.. ప్రమాదవశాత్తు ఎద్దుల బండి శారద నదిలో మునిగిపోయింది.

తృటిలో తప్పించుకున్న రైతు.. కానీ కళ్ళముందే..

చౌడవాడ గ్రామ రైతుల పంట పొలాలకు సాగునీరు కోసం శారదా నదికి అడ్డంగా రాయికట్టు కట్టారు. రాయికట్టు కిందనున్న ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గొయ్యిలో ఎద్దుల బండి దిగింది. అది కాస్తా అదుపుతప్పి నీటిలోని లోయలోకి వెళ్లి మునిగిపోయింది. దింతో రైతు వెంకటరమణ ఎడ్ల బండి నుంచి దూకి ఈదుకుంటూ ప్రాణాలు కాపాడుకున్నాడు. బండి తోనే జోడెడ్లు నీటిలో మునిగిపోయాయి ప్రాణాలు కోల్పోయాయి.

ఇవి కూడా చదవండి

గజ ఈతగాళ్ల సహకారంతో..

మునిగిపోయిన ఎడ్ల బండి వెలికి తీసేందుకు అదే గ్రామానికి చెందిన గజ ఇతగాడు నేమాలేశ్వరరావు అతికష్టం మీద శ్రమించి నీటి లోపలికి వెళ్లాడు. మునిగిపోయిన ఎడ్లకున్న పలుకు తప్పించి నీటిలో మునిగిపోయిన జోడెడ్లను బయటికి తీశారు. జీవనాధారం అయిన ఎడ్లు మృతి చెందడంతో రైతు కుటుంబం కన్నీరు మునిరుగా విలపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..