Vyuham controversy: వ్యూహం సినిమాను అడ్డుకోండి.. మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు..
అయితే ఈ వారంలోనే విడుదల కావాల్సిన సినిమా చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. మొదటగా సినిమాను సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీకి పంపింది. ఈ సినిమాపై టీడీపీ నేత లోకేష్ ఇప్పటికే సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. దీనిపై సెన్సార్ బోర్డు కూడా సినిమాను రివ్యూ కమిటీకి పంపించింది. ఇదిలా ఉంటే.. ఓవైపు ఈ వివాదం నడుస్తుండగానే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని ఫిర్యాదు చేశారు...

వ్యూహాం సినిమా విడుదలకు ముందే వివాదాలు చుట్టు ముట్టాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలను ప్రతిబింబిస్తూ తీసిన సినిమాగా వ్యూహం నిలిచింది. సీఎం జగన్ పాదయాత్ర మొదలు పెట్టి అధికారం దక్కించుకున్న వరకూ మొదటి భాగంలో చూపినట్లు ప్రచారం జరిగింది. రాంగోపాల్ వర్మ దర్శకుడు కావడంతో మరింతగా ఈ సినిమాపై చర్చ నడిచింది.
అయితే ఈ వారంలోనే విడుదల కావాల్సిన సినిమా చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. మొదటగా సినిమాను సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీకి పంపింది. ఈ సినిమాపై టీడీపీ నేత లోకేష్ ఇప్పటికే సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. దీనిపై సెన్సార్ బోర్డు కూడా సినిమాను రివ్యూ కమిటీకి పంపించింది. ఇదిలా ఉంటే.. ఓవైపు ఈ వివాదం నడుస్తుండగానే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని ఫిర్యాదు చేశారు.
టీడీపీ రిసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ కమిటి సభ్యుడు గంగాధర్… చంద్రబాబు, పవన్ కల్యాన్ ప్రతిష్టను దిగజార్చేలా సినిమా రూపొందించారని ఈసినిమా విడుదలైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తే రాజకీయ నాయకుల ప్రతిష్ట దెబ్బతిసేలా సినిమా ఉన్నట్లు అర్ధమవుతుందన్నారు. ఈ సినిమా విడుదలైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ ఫిర్యాదను ఫిర్యాదుదారుడు నేరుగా పోలీసులకు అందివ్వలేదు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు రిజిష్టర్ పోస్ట్ లో పంపారు. రాత్రి ఈ ఫిర్యాదు పోలీస్ స్టేషన్ కు చేరింది. అయితే ఇప్పటి వరకూ ఈ ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పోలీసులు చెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఏం చేయాలన్న అంశంపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద వ్యూహం సినిమా విడుదలకు ముందే వివాదాస్పదం కావడం రాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలనంగా మారాయి. దీంతో ఇప్పుడీ సినిమా విడుదలవుతుందా లేదా అన్న అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..