- Telugu News Photo Gallery Indrakeeladri Durga Malleswara Swami Devasthanam of Bejawada ready for Bangle festival
Indrakeeladri: గాజుల మహోత్సవానికి సిద్ధమైన ఇంద్రకీలాద్రి.. అందంగా ముస్తాబైన ఆలయ ప్రాంగణం
బెజవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధి గాజుల మహోత్సవం కు సిద్ధం అవుతుంది. గాజుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు తేదీని ఖరారు చేసింది. వైదిక కమిటీ లోక కల్యాణం కోసం శ్రీ శొభకృత్ నామ సంవత్సర వైదిక కమిటీ సూచనల మేరకు కార్తీక శుద్ధ విదియ బుధవారం నాడు అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.15వ తేదీన జరగనున్న ఈ గాజుల అలంకరణ వేడుక..
P Kranthi Prasanna | Edited By: Srilakshmi C
Updated on: Nov 09, 2023 | 4:04 PM

బెజవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధి గాజుల మహోత్సవం కు సిద్ధం అవుతుంది. గాజుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు తేదీని ఖరారు చేసింది. వైదిక కమిటీ లోక కల్యాణం కోసం శ్రీ శొభకృత్ నామ సంవత్సర వైదిక కమిటీ సూచనల మేరకు కార్తీక శుద్ధ విదియ బుధవారం నాడు అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

15 వ తేదీన జరగనున్న ఈ గాజుల అలంకరణ వేడుక అత్యంత వైభవపెతంగా నిర్వహించనున్నారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తులతో పాటూ ఆలయ ప్రాంగణం మొత్తం గాజులతో అలంకరించనున్నారు.

కావున బుదవారం అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవం ముగిసిన అనంతరం అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ప్రసాదంగా ఇవ్వనున్నారు. రంగు రంగుల మట్టి గాజులతో సుమారు 2 లక్షలకు పైగా గాజులతో దండలుగా చేసి అలంకరిస్తారు. ఏటా దుర్గమ్మను , ఆలయ ప్రాంగణాన్ని గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

15, 18వ శతాబ్దంలో అమ్మవారికి గాజుల అలంకారం చేసినట్లు చరిత్ర చెబుతోంది. 15వ శతాబ్దంతో విజయనగర మహారాజు దుర్గమ్మ అలంకరణ నిమిత్తం బంగారు ఆభరణాలను తయారు చేయించడంతో పాటు గాజులతో విశేష అలంకరణ చేసినట్లు వేద పండితులు చెబుతుంటారు. ఈ ఏడాది జరిగే ఉత్సవం కు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చెయ్యనున్నారు అధికారులు.

ఉదయం తెల్లవారు జామున నాలుగు గంటల నుండే గాజులు అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఉచిత దర్శనాలు ప్రారంభం అవుతాయి. 5 గంటల నుండి ప్రారంభం అయ్యే అన్ని దర్శనల్లో గాజుల అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.





























