Krithi Shetty: కృతి శెట్టి ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా ?.. ఇంతకీ ఏం చేసేందంటే..
తెలుగు సినీ పరిశ్రమలోకి 'ఉప్పెన'లా దూసుకువచ్చింది హీరోయిన్ కృతిశెట్టి. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాదు.. సౌత్ ఇండస్ట్రీలో తెగ ఫేమస్ అయిపోయింది. దీంతో ఈ బ్యూటీకి సౌత్ ఇండస్ట్రీలో క్యూ కట్టాయి. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో హిట్స్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఆ తర్వాత తెలుగులో కృతికి ఆఫర్స్ తగ్గిపోయాయి. ప్రస్తుతం కృతి చేతిలో రెండు మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అలాగే మలయాళంలో పాన్ ఇండియా సినిమా చేస్తుంది.