- Telugu News Photo Gallery Cinema photos Heroine Anushka Shetty fans request for her next mopvies in Tollywood Telugu Actress Photos
Anushka Shetty: అనుష్క శెట్టి 50వ సినిమా కోసం ఏర్పాట్లు.! ఫ్యాన్స్ రిక్వెస్ట్ తీర్చవమ్మా స్వీటీ..
అనుష్క తర్వాతి సినిమా ఏంటి..? మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయం తర్వాత కూడా ఈమె సైలెంట్‌గా ఉండటానికి కారణమేంటి..? జేజమ్మకు ఆఫర్స్ రావట్లేదా లేదంటే వచ్చిన ఆఫర్స్‌కు ఆమె నో చెప్తున్నారా..? అసలు సమస్య ఎక్కడుంది..? ఒకప్పట్లా వరసగా సినిమాలు చేయడానికి అనుష్క ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు..? ఈమె తర్వాతి ప్రాజెక్ట్ ఏమై ఉండొచ్చు..? ఆ డీటైల్స్ అన్నీ ఈ స్టోరీలో చూద్దాం.నవంబర్ 7న అనుష్క శెట్టి పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది..
Updated on: Nov 09, 2023 | 3:33 PM

అనుష్క తర్వాతి సినిమా ఏంటి..? మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయం తర్వాత కూడా ఈమె సైలెంట్‌గా ఉండటానికి కారణమేంటి..? జేజమ్మకు ఆఫర్స్ రావట్లేదా లేదంటే వచ్చిన ఆఫర్స్‌కు ఆమె నో చెప్తున్నారా..? అసలు సమస్య ఎక్కడుంది..?

ఒకప్పట్లా వరసగా సినిమాలు చేయడానికి అనుష్క ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు..? ఈమె తర్వాతి ప్రాజెక్ట్ ఏమై ఉండొచ్చు..? ఆ డీటైల్స్ అన్నీ ఈ స్టోరీలో చూద్దాం.నవంబర్ 7న అనుష్క శెట్టి పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది..

ఆమె అభిమానులు బర్త్ డే విషెస్‌తో హోరెత్తిస్తున్నారు. సినిమాలు చేసినా చేయకపోయినా అభిమానం మాత్రం అస్సలు తగ్గట్లేదని నిరూపిస్తున్నారు ఫ్యాన్స్. ఆల్ ఓకే కానీ.. అనుష్క నెక్ట్స్ సినిమాపై కన్ఫ్యూజన్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది.

అనుష్క ప్రస్తుతం తెలుగులో సినిమాలేవీ చేయట్లేదు.. మలయాళంలో మాత్రం కథనార్ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తైంది. పీరియడ్ ఫాంటసీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో మలయాళ సీనియర్ నటుడు జయసూర్య హీరోగా నటిస్తున్నారు.

ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకొస్తున్నారు మేకర్స్. 2024లోనే ఈ రెండు పార్ట్స్ విడుదల కానున్నాయి. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో ఐదేళ్ళ తర్వాత వచ్చి విజయం అందుకున్నారు అనుష్క. త్వరలోనే ఈమె భాగమతి 2 చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అశోక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. దీని సీక్వెల్ చేయాలని చూస్తున్నారు స్వీటీ. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

మొత్తానికి హిట్ వచ్చాక కూడా.. గ్యాప్ తీసుకుంటున్నారు జేజమ్మ. ఈ మధ్య స్వీటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన సారీ ఫొటోస్ ఆమె అభిమానులను , ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.




