- Telugu News Photo Gallery Cinema photos Mass maharaja Ravi teja upcoming 3 movie release in 2024 update here Telugu Heroes Photos
Ravi teja: ప్లాన్ మార్చేసిన రవితేజ.! ఇప్పుడున్న పోటీలో కచ్చితంగా హిట్టు కొడితేనే..
వరస ఫ్లాపులొస్తున్నపుడు కూడా మొండిగా ముందుకెళ్తామంటే కుదరదు. ఇప్పుడున్న పోటీలో కచ్చితంగా హిట్టు కొడితేనే రేసులో ఉంటారు.. అది ఎంత పెద్ద హీరో అయినా..! అందుకే రవితేజ ప్లాన్ మార్చేస్తున్నారు.. ఫ్లాప్స్ రాగానే న్యూ ప్లానింగ్ రెడీ చేస్తున్నారు. 2024లో 3 రిలీజ్‌లు ప్లాన్ చేస్తున్న ఈయన.. కొత్త ప్రణాళికతోనే రాబోతున్నారు. మరి అదేంటి..? ధమాకా తర్వాత ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించారు రవితేజ.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Nov 09, 2023 | 2:32 PM

వరస ఫ్లాపులొస్తున్నపుడు కూడా మొండిగా ముందుకెళ్తామంటే కుదరదు. ఇప్పుడున్న పోటీలో కచ్చితంగా హిట్టు కొడితేనే రేసులో ఉంటారు.. అది ఎంత పెద్ద హీరో అయినా..! అందుకే రవితేజ ప్లాన్ మార్చేస్తున్నారు.. ఫ్లాప్స్ రాగానే న్యూ ప్లానింగ్ రెడీ చేస్తున్నారు.

2024లో 3 రిలీజ్‌లు ప్లాన్ చేస్తున్న ఈయన.. కొత్త ప్రణాళికతోనే రాబోతున్నారు. మరి అదేంటి..? ధమాకా తర్వాత ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించారు రవితేజ. వెంటనే వాల్తేరు వీరయ్య కూడా హిట్ అవ్వడంతో మాస్ రాజా మళ్లీ దారిన పడ్డాడులే అని పండగ చేసుకున్నారు ఫ్యాన్స్.

కానీ వాళ్ల ఆనందం మూన్నాళ్ల ముచ్చటే అయింది. సమ్మర్‌లో రావణాసుర.. ఈ మధ్యే టైగర్ నాగేశ్వరరావు సినిమాలు మళ్లీ రవితేజను ఫ్లాపుల్లోకి నెట్టేసాయి. దాంతో రేసులో మళ్లీ వెనకబడ్డారు ఈ సీనియర్ హీరో.

వరసగా ఫ్లాపులు రావడంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో రవితేజ ప్లానింగ్ మార్చేసారు. నిన్నమొన్నటి వరకు అప్‌కమింగ్ దర్శకులు, కొత్త వాళ్లతో పనిచేసిన ఈయన.. కొన్నాళ్లు వాళ్లకు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు.

ఈగల్ తర్వాత అంతా సీనియర్స్‌తోనే వర్క్ చేయాలని చూస్తున్నారు మాస్ రాజా. ఈ నేపథ్యంలోనే తనకు హ్యాట్రిక్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో సినిమాకు కమిటయ్యారు రవితేజ.

2024 సమ్మర్‌లో గోపీచంద్, రవితేజ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. దీని తర్వాత కూడా ఎక్స్‌పీరియన్సడ్ దర్శకుల వైపే చూస్తున్నారు మాస్ రాజా. హరీష్ శంకర్‌తోనూ ఓ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతున్నా..

అందులో నిజం లేదంటున్నారు ఆ దర్శకుడు. ఉస్తాద్ తర్వాతే ఏదైనా అంటున్నారాయన. మొత్తానికి మాస్ రాజా ప్లానింగ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలిక.





























