Anakapalli : పొలంలో అదే పనిగా అరుస్తున్న కుక్కలు.. ఏంటా అని రైతులు వెళ్లి చూడగా
అది అలాంటి ఇలాంటి పాము కాదు.. గిరి నాగు... దాదాపు 13 అడుగులు ఉంటుంది. అది పొలాల్లో కనిపించడంతో కుక్కలు గట్టిగా అరుస్తూ పామును వెంబడించాయి. గమనించిన రైతులు అక్కడికి వెళ్లి భారీ గిరి నాగును చూసి షాకయ్యారు. రైతులు గిరినాగును తరిమే ప్రయత్నం చేయగా.. అది వారి మీదకు దూసుకొచ్చింది..

అనకాపల్లి జిల్లాలో ఓ భారీ గిరి నాగు రైతులకు ఎదురుపడింది. కల్లాలలో పనిచేసుకుంటున్న రైతులు కుక్కలు అరవడం చూసి ఏంటా అని చూసేందుకు వెళ్లారు. అక్కడ.. భారీ గిరి నాగు కనిపించింది. దీంతో దాన్ని నిలువరించే ప్రయత్నం చేయగా.. అది దూసుకుంటూ మీదకి వచ్చింది. దీంతో ఆ రైతులు ప్రాణ భయంతో పరుగులు తీశారు.
దేవరపల్లిలో చింతల వారి కల్లాల వద్ద సుమారు పదమూడు అడుగుల భారీ గిరినాగు హల్ చల్ చేసింది. అక్కడున్న కొన్ని కుక్కలు గిరినాగును చూసి అరిచాయి. దీంతో స్థానిక రైతులు గుర్తించి గిరినాగును నిలువరించే ప్రయత్నం చేశారు. గిరి నాగు భారీ భుసలు కొడుతూ పైకి వచ్చింది. ఆ తరువాత రైతుల వెనక్కి తగ్గడంతో.. పక్కన ఉన్న పొలాల్లోకి జారుకుంది ఆ భారీ గిరి నాగు. అయితే గిరి నాగులు కనిపిస్తే హాని చేయకుండా తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు స్నేక్ కేచర్స్. అనవసరంగా వాటి జోలికి వెళ్లి ప్రణాలపై తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు సమీపాన ఉండే గ్రామాల్లో గిరి నాగులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. ఈ పామును కింగ్ కోబ్రా అని కూడా పిలుస్తారు.
వామ్మో..అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లిలో 15 అడుగుల భారీ పాము రైతులను భయపెట్టింది. పొలాల్లో కుక్కలు అడ్డుకోవడంతో పాము రైతులపై దూసుకొచ్చింది..రైతులు భయంతో పరుగులు తీశారు. pic.twitter.com/MwDJ3xe1m4
— Journalist Rekha Mudhiraj (@JournalistReka) March 29, 2025
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




