రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న 12 ట్రైన్స్.. వివరాలు ఇవే..
Special Trains From April 1: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ క్రమక్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోంది....
Special Trains From April 1: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ క్రమక్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరో 12 రైళ్లను పునరుద్దరించేందుకు సిద్దమైంది. ఈ ట్రైన్స్‌లో పలు డైలీ మెయిల్ సర్వీసులు ఉండగా.. మరికొన్ని వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి.
ఏప్రిల్ 1నుంచి మొదలుకానున్న రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..
విజయవాడ–సాయినగర్ షిర్డి– విజయవాడ(మెయిల్ ఎక్స్‌ప్రెస్): 07207/07208
విజయవాడ–సికింద్రాబాద్–విజయవాడ(మెయిల్ ఎక్స్‌ప్రెస్) : 02799/02800
విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం(మెయిల్ ఎక్స్‌ప్రెస్) : 02739/02740
గుంటూరు –విశాఖపట్నం–గుంటూరు : 07239/07240
గూడూరు –విజయవాడ–గూడూరు(మెయిల్ ఎక్స్‌ప్రెస్) : 02734/02644
నర్సాపూర్–ధర్మవరం–నర్సాపూర్(మెయిల్ ఎక్స్‌ప్రెస్): 07247/ 07248
ఈ రైళ్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పునరుద్దరించానున్నారు. వీటిని ప్రత్యేక రైళ్లుగా దక్షిణ మధ్య రైల్వే నడవనుంది. కాగా, ప్రస్తుతం రైల్వే శాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రత్యేక ట్రైన్స్‌గా నడుపుతుండగా.. ప్యాసింజర్ రైళ్లను మాత్రం ఇంకా పునరుద్దరించలేదు. రెగ్యులర్ రైళ్ల కోసం జనాలు ఇంకా ఎదురు చూపులు చూస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!
కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!