AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID Politics: కరోనా ఆంక్షలపై రాజకీయ రంగు.. దేశ అధ్యక్షుడితో గవర్నర్ల ఫైట్..

అమెరికాలో కరోనా ఆంక్షల విషయంలో అధ్యక్షుడు జోబైడెన్‌కు రిపబ్లికన్‌ పార్టీకి చెందిన గవర్నర్లకు ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది.. దేశంలో మరోసారి కొవిడ్‌ కేసులు విజృంభిస్తుంటే మాస్కులు,

COVID Politics: కరోనా ఆంక్షలపై రాజకీయ రంగు.. దేశ అధ్యక్షుడితో గవర్నర్ల ఫైట్..
Joe Biden
Sanjay Kasula
|

Updated on: Aug 04, 2021 | 9:55 PM

Share

అమెరికాలో కరోనా ఆంక్షల విషయంలో అధ్యక్షుడు జోబైడెన్‌కు రిపబ్లికన్‌ పార్టీకి చెందిన గవర్నర్లకు ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది.. దేశంలో మరోసారి కొవిడ్‌ కేసులు విజృంభిస్తుంటే మాస్కులు, వ్యాక్సిన్లకు సంబంధించిన నిబంధనలకు టెక్స్‌స్‌, ఫ్లోరిడా గవర్నర్లు తూట్లు పొడుస్తున్నారని దేశాధ్యక్షుడు గుర్రుగా ఉన్నారు.అగ్రరాజ్యంలో మరోసారి కరోనా విలయతాండవం చేస్తోంది. రోజూవారీ కేసుల సంఖ్య మరోసారి లక్ష దాటిపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇవన్నీ కూడా కూడా చాలా వరకూ డెల్టా వేరియంట్‌ కేసులే.. ఇందులో కాలిఫోర్నియా, టెక్సస్‌, ఫ్లోరిడా, న్యూయార్క్‌ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత అగ్రరాజ్యంలో కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా.. గత కొన్ని వారాలుగా మరోసారి కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.

అమెరికాలో కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వచ్చారు. చాలా రాష్ట్రాలో మాస్కులు తప్పని సరి అనే నిబంధన కచ్చితం కాదని, ప్రజలు స్వయం నిర్ణయం తీసుకోవచ్చని తెలిపాయి. అయితే దేశంలో మరోసారి కరోనా కేసులు పెరగడంలో బైడెన్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో పాటు మాస్కులు, భౌతిక దూరం ఆంక్షలను కచ్చితంగా పాటించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించారు.

ఒకవైపు డెల్టా వేరియంట్‌ కేసులు విజృంభిస్తుంటే రిపబ్లికన్‌ రాష్ట్రాల గవర్నర్లు, వారి పాలనలోని కొన్ని నగరాలు దీన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ముఖ్యంగా చెందిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, టెక్సాస్​ గవర్నర్ గ్రెగ్ అబోట్ట్ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాలను బేఖాతరు చేశారు. టీకాలు, మాస్కులు తప్పని సరి కాదని వారు తమ రాష్ట్రల్లో ఉత్తర్వులు జారీ చేశారు. వీరి చర్యలు బైడెన్‌కు ఆగ్రహం తెప్పించాయి. దీంతో నిబంధనలకు సహకరించని గవర్నర్లు అడ్డు తప్పుకోవాలని హెచ్చరించారు.

కరోనా కేసులు మరణాల సంఖ్య విషయంలో అగ్రరాజ్యం ఇప్పటికే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కరోనా తగ్గుముఖం పట్టింది. వ్యాక్సిన్లను భారీగా నిల్వ చేసుకున్నా ఇంకా చాలా మంది టీకాలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు పలు రాష్ట్రాల గవర్నర్లకు ప్రోత్సాహకాలు, లాటరీలను కూడా ప్రవేశ పెట్టారు. అయినా తగిన ప్రయోజం ఉండటం లేదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: Yoga Diet: యోగా తర్వాత ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోండి.. మీలో స్టామినా పెరుగుతుంది..

UDAN scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉడాన్ పథకంలో భాగంగా 40 విమాన మార్గాలు..

IND vs ENG 1st Test Live: తొలి ఓవర్‌లోనే టీమిండియా రివేంజ్.. తిప్పేసిన బుమ్రా..