Yoga Diet: యోగా తర్వాత ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోండి.. మీలో స్టామినా పెరుగుతుంది..

యోగా శరీరం, మనస్సు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. యోగాతో పాటు సమతుల్య ఆహారం చాలా అవసరం. ఇది ఆరోగ్యాన్ని

Yoga Diet: యోగా తర్వాత ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోండి.. మీలో స్టామినా పెరుగుతుంది..
Yoga Diet
Follow us

|

Updated on: Aug 04, 2021 | 7:25 PM

యోగా శరీరం, మనస్సు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. యోగాతో పాటు సమతుల్య ఆహారం చాలా అవసరం. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంతే కాదు మీలో శక్తి ని పెంచుతుంది. స్టామినాను పెంచడానికి సమతుల్య ఆహారం అవసరం అవుతుంది. అందువల్ల యోగా సాధన చేసిన తర్వాత ఆహారంలో తగినంత ఫ్యాట్, ప్రోటీన్, పిండి పదార్థాలు ఉన్నటువంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. యోగా చేసిన తర్వాత మీరు  ఎలాంటి ఫుడ్‌ను మీ మెనూలో చేర్చవచ్చో తెలుసుకోండి.

సూప్ – మీరు యోగాభ్యాసం చేసిన తర్వాత చాలా కేలరీలు ఖర్చు చేస్తుంటారు. మీరు మీ సిస్టమ్‌కి తగిన పోషకాహారాన్ని కార్బోహైడ్రేట్ల రూపంలో తీసుకోవాలి. కాబట్టి ఆరోగ్యకరమైన శాఖాహారం లేదా చికెన్ ఉడకబెట్టిన సూప్ తీసుకోవడం మంచిది. మీరు తీసుకునే సూప్‌లో క్యారెట్లు, సెలెరీ, పాలకూర లేదా క్యాబేజీతో తయారు చేయవచ్చు.

సలాడ్ – యోగాభ్యాసం తర్వాత మీరు పోషకమైన ఆహారాన్ని పొందవచ్చు. దీని కోసం మీరు పండ్లు లేదా కూరగాయల సలాడ్ తినవచ్చు. ఇది కాకుండా మీరు వివిధ రకాల గింజలు, వోట్స్, అరటి, టోఫు,  స్మూతీలు మొదలైనవి తినవచ్చు. మీరు రొట్టెతో వేరుశెనగ బట్టర్ తినవచ్చు. ఇది కాకుండా మీరు వోట్ మీల్స్ తినవచ్చు.

పనీర్ – అధిక ప్రోటీన్లు కలిగిన ఆహారం తీసుకోండి. యోగాభ్యాసం సమయంలో చాలా కేలరీలను కరిగిస్తారు. ఆ తర్వాత పనీర్ వంటి అధిక కేలరీల ఆహారాలు తినాలి. మీరు వేయించిన గుడ్లతో రొట్టెని కూడా తినవచ్చు. ఇందులో ఆరోగ్యకరమైన ఫ్యాట్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

కొబ్బరి నీరు – భారతీయులు ఎంతో పురాతన కాలం నుండి కొబ్బరి నీటిని ఉపయోగిస్తున్నారు. అలానే ఇప్పటి కాలంలో కూడా వాడుతున్నారు. అయితే నిజానికి కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో అనేకరకాల పోషకాలు ఉన్నాయి. వాటితో మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చును. ఖనిజాలు కొబ్బరి నీటిలో అధికంగా ఉంటాయి. కివి, సిట్రస్ పండ్లు, పైనాపిల్, పుచ్చకాయ, సెలెరీ, టమోటా వంటి ఆహారాలలో నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది మీకు చాలా కాలం పాటు పూర్తిస్థాయిలో తాజా అనుభూతిని కలిగిస్తుంది. కాఫీ, ఇతర చక్కెర పానీయాలు మానుకోండి. మిమ్మల్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. కొబ్బరి నీరు దీనికి ఆరోగ్యకరమైన ఎంపిక.

ఈ ఆహారాలకు దూరంగా ఉండండి- యోగాభ్యాసం తర్వాత చక్కెర, కొవ్వుతో నిండిన మాంసం( మటన్, చికెన్) ఆహారాలను ఆహారంగా తీసుకోవడం మంచిది కాదు. అధిక కొవ్వు పదార్థాలు, ఫ్రైస్ లేదా చిప్స్ తినడం మానుకోండి. యోగా సాధన తర్వాత పోషకమైన ఆహారం, స్నాక్స్ మాత్రమే తినండి.

ఇవి కూడా చదవండి: UDAN scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉడాన్ పథకంలో భాగంగా 40 విమాన మార్గాలు..

IND vs ENG 1st Test Live: తొలి ఓవర్‌లోనే టీమిండియా రివేంజ్.. తిప్పేసిన బుమ్రా..