AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Luck: లక్ అంటే ఇది.. గింగిరాలు తిరుగుతూ వచ్చి ఆమె కాళ్ల ముందు వాలింది

ఫేట్ ఎప్పుడు.. ఎలా మారుతుందో అస్సలు ఊహించలేం. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా ఫలితాలు ఉండవు. మరికొన్నిసార్లు పరధ్యానంగా..

Luck: లక్ అంటే ఇది.. గింగిరాలు తిరుగుతూ వచ్చి ఆమె కాళ్ల ముందు వాలింది
Lottery Winner
Ram Naramaneni
|

Updated on: Aug 05, 2021 | 5:41 PM

Share

ఫేట్ ఎప్పుడు.. ఎలా మారుతుందో అస్సలు ఊహించలేం. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా ఫలితాలు ఆశాజనకంగా ఉండవు. మరికొన్నిసార్లు పరధ్యానంగా చేసినా సరే..  సూపర్ రిజల్ట్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చేస్తుంది. తాజాగా  అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రం కేన్సస్​కు చెందిన 51 ఏళ్ల ఏంజెలా కార్వేలాకు అలానే జరిగింది. ఆమె అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఫ్లోరిడాలో విమానం ఎక్కాల్సి ఉంది. ఇంతలో ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తున్నట్లు సిబ్బంది  అనౌన్స్ చేశారు. దీంతో చేసేదేమీ లేక బయటకు వచ్చిన కార్వేలా.. దగ్గర్లో ఉన్న ఓ సూపర్​మార్కెట్​లో 30 డాలర్లు (రూ.2,220) పెట్టి లాటరీ టికెట్​ కొనుగోలు చేసింది. అంతే.. ఇక్కడితో ఆమె దశ తిరిగింది. ద ఫాస్టెస్ట్​ రోడ్​ అనే సంస్థ నిర్వహించిన ఈ లాటరీలో కార్వేలా విన్నర్‌గా నిలిచింది. ప్రైజ్​మనీగా ఒక మిలియన్​ డాలర్లు (సుమారు రూ.7.5కోట్లు) గెలుచుకుంది.

ఊహించని విధంగా దక్కిన ఈ లాటరీ టికెట్​ గెలుపుతో కార్వేలా ఫుల్ హ్యపీ అయిపోయింది. తనకు విమానం రద్దు అయినప్పుడే ఏదో వింత అనుభవం ఎదురుకానుందని అనిపించిందని వెల్లడించింది. సమయం గడపడం కోసం సరదాగా కొన్న స్క్రాచ్​ ఆఫ్​ టికెట్లతో కోట్లు గెలుచుకున్నానని ఆనందం వ్యక్తం చేసింది. ఈ డబ్బులో కొంత మొత్తం టాక్స్‌లకు పోగా.. 7,90,000 డాలర్లు (రూ.5.8 కోట్లు) కార్వేలా చేతికి అందనున్నాయి. కార్వేలాకు లాటరీ టికెట్​ విక్రయించిన పబ్లిక్స్​ సూపర్​ మార్కెట్​కు కూడా 2000 డాలర్లు (రూ.1.4 లక్షలు) బోనస్​ కమీషన్​ అందనుంది.

Also Read: న్యూసెన్స్ వ్యవహారంపై స్పందించిన నిహారిక భర్త చైతన్య.. పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు

దెబ్బ మీద దెబ్బ.. పాపం శిల్పాకు ఇదేం పరిస్థితి అబ్బా..!

Follow Us
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు