AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joe Biden Twitter: ప్రెసెడెంట్ గారూ నన్ను అన్‌ఫాలో చేయండి.. జో బైడెన్‌ను అభ్యర్థించిన నటి.. కారణమేంటంటే..

Joe Biden Twitter: సామాన్యులు మొదలు.. దేశాధినేతల వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండలేరంటే అతిశయోక్తి కాదు.

Joe Biden Twitter: ప్రెసెడెంట్ గారూ నన్ను అన్‌ఫాలో చేయండి.. జో బైడెన్‌ను అభ్యర్థించిన నటి.. కారణమేంటంటే..
Shiva Prajapati
|

Updated on: Feb 24, 2021 | 11:05 PM

Share

Joe Biden Twitter: సామాన్యులు మొదలు.. దేశాధినేతల వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. అంతలా ప్రభావితం చేస్తున్నాయి సోషల్ మీడియా సంస్థలు. అయితే, అవే సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం లు.. ఎంతో మందికి క్రేజ్ తీసుకువచ్చాయి. ఇదిలాఉంటే.. దేశాధినేతలంటే సహజంగానే విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. అది సోషల్ మీడియాలో అయితే ఇంకాస్త ఎక్కువే అని చెప్పాలి. అయితే, ప్రముఖులు మాత్రం చాలా కొద్ది మందిని మాత్రమే ఫాలో అవుతుంటారు. ప్రధానంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అధికారిక ట్విట్టర్@POTUS ద్వారా కేవలం 13 మందిని ఫాలో అవుతున్నారు. వీరిలోనూ అత్యంత ప్రముఖులు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్, ఇతర వ్యక్తులు ఉన్నారు. అయితే, ఈ 13 మందిలో ఓ నటి కూడా ఉండటం విశేషం. ఆమె అమెరికన్ టెలివిజన్ స్టార్, మోడల్ క్రిస్సీ టైగెన్.

అయితే, తొలుత ఆమె అభ్యర్థన మేరకే బైడెన్ క్రిస్సీని ఫాలో అవుతుండగా.. మళ్లీ ఆమె అభ్యర్థనమే అన్‌ఫాలో చేశారు బైడెన్. ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. అసలు విషయంలోకిళితే.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే క్రిస్సీ గతంలో నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విపరీతమైన విమర్శలు చేసింది. దాంతో ట్రంప్ ఆమె ఖాతాను బ్లాక్ చేశారు. తాజాగా కొత్త అధ్యక్షుడుగా బైడెన్ రావడంతో క్రిస్సీ.. తనను ఫాలో అవ్వాలంటూ పలుమార్లు @POTUS కోరింది. ఆ మేరకు ట్వీట్లు చేసింది. క్రిస్సీ అభ్యర్థనను మన్నించిన బైడెన్.. ఆమెను ఫాలో చేశారు. అయితే, ఏమైందో తెలియదు కానీ.. తాజాగా తనను అన్‌ఫాలో చేయండంటూ మళ్లీ అభ్యర్థిస్తూ ట్వీట్ చేసింది. ‘నాకు నాలా గుర్తింపు దక్కాలంటే మీరు నన్ను అనుసరించొద్దు అని కోరుతున్నాను’ అంటూ ట్వీట్ చేసింది. అది చూసిన బైడెన్ క్రిస్సీని అన్‌ఫాలో చేశారు. దాంతో ప్రస్తుతం @POTUS ఫాలో అవుతున్న వారి సంఖ్య 12 ఉంది. అయితే, క్రిస్సీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ముందుగా ఫాలో అవమని కోరడం.. మళ్లీ తానే అన్‌ఫాలో కొట్టాలని కోరడం విచిత్రంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తు్న్నారు.

Chrissy Teigen Twitter:

Also read:

కాజల్‌‌కు భూమి మీద నూకలు ఉన్నాయి.. రెప్పపాటులో మృత్యువును తప్పించుకుంది

ఆ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 9 వేలకు చేరిన రోజువారీ కేసుల సంఖ్య

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్